MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-as-telangana-warior54b826de-9328-47a9-80e1-b865ac440ce2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-as-telangana-warior54b826de-9328-47a9-80e1-b865ac440ce2-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ కు చారిత్రాత్మక పౌరాణిక జానపద సినిమాలలో నటించడం బాగా ఇష్టం. ఆ మక్కువతోనే ‘భైరవద్వీపం’ ‘ఆదిత్య 369’ 'పాండురంగడు' ‘శ్రీరామరాజ్యం’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు.అయితే బాలకృష్ణ కు తెలంగాణ చరిత్ర సాయుధపోరాటం పై ఎంతో ఆశక్తి ఈ చరిత్ర గురించి ఎవరు చెప్పినా బాలకృష్ణ గంటలు కొద్ది అప్పటి విషయాలను తెలుసుకుంటాడట. అంతేకాదు తెలంగాణ సాయుధపోరాటం పై ఒక సినిమా చేయాలని బాలకృష్ణకు తీరని కోరిక అని టాక్. ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ దర్శకుడు చరణ్ లక్కాకుల కొన్ని సంవbalakrishna;;balakrishna;adhithya;paandu;saptagiri;telangana;komaram bheem;cinema;history;director;darsakudu;gautamiputra satakarni;joshతెలంగాణ పోరాట యోధుడుగా బాలకృష్ణ !తెలంగాణ పోరాట యోధుడుగా బాలకృష్ణ !balakrishna;;balakrishna;adhithya;paandu;saptagiri;telangana;komaram bheem;cinema;history;director;darsakudu;gautamiputra satakarni;joshTue, 04 May 2021 09:00:00 GMTబాలకృష్ణ కు చారిత్రాత్మక పౌరాణిక జానపద సినిమాలలో నటించడం బాగా ఇష్టం. ఆ మక్కువతోనే ‘భైరవద్వీపం’ ‘ఆదిత్య 369’ 'పాండురంగడు' ‘శ్రీరామరాజ్యం’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు.


అయితే బాలకృష్ణ కు తెలంగాణ చరిత్ర సాయుధపోరాటం పై ఎంతో ఆశక్తి ఈ చరిత్ర గురించి ఎవరు చెప్పినా బాలకృష్ణ గంటలు కొద్ది అప్పటి విషయాలను తెలుసుకుంటాడట. అంతేకాదు తెలంగాణ సాయుధపోరాటం పై ఒక సినిమా చేయాలని బాలకృష్ణకు తీరని కోరిక అని టాక్. ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ దర్శకుడు చరణ్ లక్కాకుల కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ ను కలిసి తనకు దర్శకుడుగా ఒక అవకాశం ఇమ్మని అడిగాడట.




దీనితో బాలయ్య ఆ దర్శకుడుని ప్రోత్సహిస్తూ ‘తెలంగాణ సాయుధ పోరాటం’ పై ఒక కథను రెడీ పెట్టుకుని తన వద్దకు వస్తే తాను అవకాశం ఇస్తానని అప్పట్లో బాలయ్య ఈ దర్శకుడుకి మాట ఇచ్చాడట. దీనితో జోష్ లోకి వెళ్ళిపోయిన చరణ్ లక్కాకుల తెలంగాణ సాయుధపోరాటం పై విపరీతమైన పరిశోధన చేసి అనేక పుస్తకాలు చదివి ఆ వివరాలతో ఒక బలమైన స్క్రిప్ట్ ను రెడీ చేసి ఈ మధ్యనే బాలయ్యను కలిసాడట. ఈ స్క్రిప్ట్ బాలయ్యకు బాగా నచ్చడంతో ఈ మూవీలో నటించాలాని భావించినా ఇలాంటి భారీ సినిమాలను నిర్మించే నిర్మాతల కోసం బాలయ్య అన్వేషిస్తూ ఈ స్క్రిప్ట్ ను పెండింగ్ లో పెట్టాడట.


అంతేకాదు తాను ఎప్పుడు బాలకృష్ణను కలిసినా చాల అభిమానంగా మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తూ ఉంటాడని చరణ్ లక్కాకుల పొంగిపోతున్నాడు. అయితే గతంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేసిన 'పరమ వీరచక్ర' సినిమాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో బాలయ్య నటించాడు. ఆ సినిమా సూపర్ ఫ్లాప్ అలాంటి పరిస్థితులలో సెంటిమెంట్స్ ను బాగా నమ్ముకునే బాలకృష్ణ ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు చేస్తాడో ఆయనకే తెలియాలి..  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..!!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>