Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adavi-sesh8b5b5e28-8689-48d9-bb17-0573e2120a70-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adavi-sesh8b5b5e28-8689-48d9-bb17-0573e2120a70-415x250-IndiaHerald.jpg కరోనా కాలంలో సెలబ్రిటీలంతా పెద్ద మనసు చాటుకుంటూ తమ వంతుగా సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఎక్కడేనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో ఈ జాబితాలో చేరాడు. ఆసుపత్రిలో అల్లాడుతున్న..adavi sesh;koti;mahesh;jeevitha rajaseskhar;sandeep;mumbai;sony;tollywood;cinema;media;king;hindi;army;hero;king 1;goodachari;chitramకోవిడ్ పేషెంట్లకోసం టాలీవుడ్ హీరో.. ఏం చేశాడో తెలుసా..?కోవిడ్ పేషెంట్లకోసం టాలీవుడ్ హీరో.. ఏం చేశాడో తెలుసా..?adavi sesh;koti;mahesh;jeevitha rajaseskhar;sandeep;mumbai;sony;tollywood;cinema;media;king;hindi;army;hero;king 1;goodachari;chitramTue, 04 May 2021 22:14:23 GMTఇంటర్నెట్ డెస్క్: కరోనా కాలంలో సెలబ్రిటీలంతా పెద్ద మనసు చాటుకుంటూ తమ వంతుగా సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఎక్కడేనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో ఈ జాబితాలో చేరాడు. ఆసుపత్రిలో అల్లాడుతున్న కరోనా బాధితులు కష్టాల్లో ఉన్నారని తెలియగానే హుటాహుటిన తనవంతుగా వారికి అవసరమైన సహాయాన్ని అందించాడు. దీంతో ఇప్పుడు ఈ హీరో పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? అడవి శేష్.

హైదరాబాద్‌లోని కింగ్ కోటి ఆసుపత్రిలో కరోనా బాధితులు చాలా మంది చికిత్స పొందుతున్నారు. దాదపు 200కు పైగా పేషంట్లు ఈ ఆసుపత్రిలో ఉన్నారు. వారితో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తం కలిసి 300 మంది వరకు ఇక్కడే ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆసుపత్రిలో తాగునీరు కొరత ఏర్పడింది. ఒక్కసారిగా తాగునీరు అయిపోవడంతో రోగ్యులు, వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అసలే ఎండాకాలం కావడంతో ఆసుపత్రిలోని కొంతమంది పేషెంట్లు ఏకంగా డీహైడ్రేషన్‌కు కూడా గురయ్యారు.

సోషల్ మీడియా ద్వారా ఈ విషయం అడవి శేష్‌కు తెలిసింది. వెంటనే స్పందించిన అతడు 850 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను ఆసుపత్రికి పంపాడు. శేష్ చేసిన ఈ సాయంతో అక్కడ మంచినీటి కొరతవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ సకాలంలో మంచి నీరు అందింది. ఇదొక్కటే కాదు ఇకముందు కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాల్సిందిగా ఆసుపత్రి వర్గాలకు సూచించాడట శేష్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శేష్‌పై నెటిజన్లు విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అడవి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 2008లో జరిగిన ముంబై ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఆ సమయంలో ఆర్మీ మేజర్‌గా ఉన్న మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. సోనీ పిక్చర్స్, జి. మహేశ్ బాబు ఎంటర్‌టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం తొలుత తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కబోతోంది. ఆ తర్వాత మళయాళంలో డబ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో శేష్‌తో కలిసి గూఢచారి సినిమాలో నటించిన శోభితా ధూళిపాళ్ల కూడా ఓ ప్రాముఖ పాత్రలో కనిపించబోతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>