EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్‌ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌ అవుతోంది. ఈటల రాజేందర్‌ అంటే చాలా మందికి గౌరవం ఉన్న నాయకుడు. ఉద్యమసమయంలో పోరాడిన నేతగా.. ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రిగా నిండుగా తొణకని నాయకుడు. అలాంటి వాడిపై ఏకంగా వందల ఎకరాల భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి.. పగబట్టినట్టు ఛానళ్లు, పత్రికలు రాస్తున్నాయి. అంతే కాదు..ఏకంగా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈటలపై విచారణ జరిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కమిటీల మీద కమిటీలు వేయిస్తున్నారు.. అసలు టీవీల్లో కథనాలు వచ్చిన గంటల సేపటకే సీఎం విచారణకు ఆదేkcr;kcr;ktr;revanth;surabhi;surabhi new;telangana rashtra samithi trs;revanth reddy;congress;collector;chief minister;episode;survey;minister;reddy;etela rajender;party;mantraఈటల బర్తరఫ్‌ సరే.. మరి కేటీఆర్, మల్లారెడ్డి ఎట్సెట్రా సంగతేంటి..?ఈటల బర్తరఫ్‌ సరే.. మరి కేటీఆర్, మల్లారెడ్డి ఎట్సెట్రా సంగతేంటి..?kcr;kcr;ktr;revanth;surabhi;surabhi new;telangana rashtra samithi trs;revanth reddy;congress;collector;chief minister;episode;survey;minister;reddy;etela rajender;party;mantraTue, 04 May 2021 00:00:00 GMTఈటల రాజేందర్‌ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌ అవుతోంది. ఈటల రాజేందర్‌ అంటే చాలా మందికి గౌరవం ఉన్న నాయకుడు. ఉద్యమసమయంలో పోరాడిన నేతగా.. ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రిగా నిండుగా తొణకని నాయకుడు. అలాంటి వాడిపై ఏకంగా వందల ఎకరాల భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి.. పగబట్టినట్టు ఛానళ్లు, పత్రికలు రాస్తున్నాయి. అంతే కాదు..ఏకంగా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈటలపై విచారణ జరిపిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కమిటీల మీద కమిటీలు వేయిస్తున్నారు.. అసలు టీవీల్లో కథనాలు వచ్చిన గంటల సేపటకే సీఎం విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే కలెక్టర్ రిపోర్టు ఇచ్చేస్తారు.. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈటల నుంచి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసేశారు.. రెండు దశాబ్దాల అనుబంధాన్ని కేవలం రెండు రోజుల్లో తెంపేశారు కేసీఆర్.

మరి భూకబ్జా ఆరోపణలపై ఇంత త్వరగా రియాక్టయిన కేసీఆర్.. మరి మిగిలిన మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు అంతగా స్పందించడం లేదన్నది ఇప్పుడు అనేక మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. మంత్రి ఈటెల రాజేందర్ భూములు ఆక్రమించారని...  వెంటనే విచారణకు సీఎం ఆదేశించారు. అయితే మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారని చెబుతున్న దేవర యాంజాల్‌లోనే మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలకు భూములు ఉన్నాయని.. వారు కూడా అవే భూములు కొన్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బయటపెట్టారు.

ఈటలపై ఆగమేఘాల మీద విచారణ చేయించిన కేసీఆర్.. కేటీఆర్, మల్లారెడ్డి భూములపైనా విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు.. కేసీఆర్ బంధువుల 438 సర్వేనెంబర్లో లో సురభి భూమ్ రావు పేరున భూములున్నాయని..  టీఆర్ఎస్ నేతలకు అనేకమందికి అక్కడ భూములున్నాయని... దేవరయాంజాల్లో 658 సర్వే నెంబర్ లో 7 ఎకరాల్లో కార్మికశాఖ  మంత్రి మల్లారెడ్డి  అద్భుతమైన విలాసవంతమైన ఫాం హౌజ్ కట్టుకున్నారని  రేవంత్ రెడ్డి అన్నారు.

1925 నుంచి 2021 వరకు దేవరయాంజాల్ భూముల వివరాలు ఐఏఎస్ కమిటి బయట పెట్టాలని..  ఆ గ్రామానికి ఎంపీని నాకే వివరాలు అధికారులు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి దీనిపై అధికార పార్టీ ఏమైనా స్పందిస్తుందా.. లేక తన పని తాను చేసుకుంటూ వెళ్తుందా..?





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యాన్ ప్రశ్నతో సీక్రెట్ చెప్పిన ఉప్పెన బ్యూటీ

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>