MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-venu-sriram07fce085-57f7-416f-8927-dfff289078f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-venu-sriram07fce085-57f7-416f-8927-dfff289078f8-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ ముందు వరకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ అంటే చాలామందికి తెలీదు.ఎప్పుడో సిధార్థ తో ఓ మై ఫ్రెండ్ ఆ తర్వాత చాలా కాలానికి నాని తో యమ్ సి ఏ లాంటి సినిమాలు తీశారు. ఆయన ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఇన్ని సంవత్సరాలుగా రాని క్రేజ్ వేణు కి ఒక్క సినిమాతో వచ్చింది. ఆ సినిమానే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాvenu sriram;pawan;nani;amitabh bachchan;allu arjun;kalyan;pawan kalyan;sriram;hyderabad;vaishno devi;dargah sharif;bollywood;cinema;netizens;remake;director;gift;pink;arjun 1;venu sreeram;sri venkateshwara creations;mass;oh my friendహ్యాపీ బర్త్ డే మాస్ గాడ్ వేణు శ్రీరామ్హ్యాపీ బర్త్ డే మాస్ గాడ్ వేణు శ్రీరామ్venu sriram;pawan;nani;amitabh bachchan;allu arjun;kalyan;pawan kalyan;sriram;hyderabad;vaishno devi;dargah sharif;bollywood;cinema;netizens;remake;director;gift;pink;arjun 1;venu sreeram;sri venkateshwara creations;mass;oh my friendTue, 04 May 2021 15:30:00 GMTవకీల్ సాబ్ ముందు వరకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ అంటే చాలామందికి తెలీదు.ఎప్పుడో సిధార్థ తో ఓ మై ఫ్రెండ్ ఆ తర్వాత చాలా కాలానికి నాని తో యమ్ సి ఏ లాంటి సినిమాలు తీశారు. ఆయన ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఇన్ని సంవత్సరాలుగా రాని క్రేజ్ వేణు కి ఒక్క సినిమాతో వచ్చింది. ఆ సినిమానే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్. 

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ చిత్రం. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఈ సినిమాతో వేణు శ్రీరామ్ పవన్ అభిమానులకి మాస్ గాడ్ గా మారిపోయారు.ఇక ఈ మాస్ గాడ్ వేణు శ్రీరామ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ని వాళ్ళకి అందించినందుకు వేణు శ్రీరామ్  పుట్టినరోజు ని వాళ్ళు కూడా మాస్ గాడ్ పేరుతో సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అది ఏంటంటే దర్శకుడు వేణు శ్రీరామ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడట. హైదరాబాద్ లో ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియరాలేదు.ఇక వేణు శ్రీరామ్ ప్రస్తుతం అల్లు అర్జున్ ఐకాన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కబోతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా సంవత్సరాలగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..కానీ కండీషన్స్

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>