PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ మరో షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే.. అయినా సరే ఈటల రాజేందర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేసీఆర్ మీద విమర్శల దాడి చేస్తూ ఉండడంతో ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ ను విమర్శిస్తున్నారు.. అయితే మరోపక్క ఈటల రాజేందర్ కు మరో షాక్ ఇచ్చేందుకు కూడా పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తtrs;kcr;vidyasagar;jamuna;kamalakar;telangana rashtra samithi trs;korcha;eatala rajendar;gangula kamalakar;mp;district;high court;huzur nagar;collector;chief minister;car;mla;minister;press;letter;medak;karimnagar;etela rajender;party;eshwar;mantraఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?trs;kcr;vidyasagar;jamuna;kamalakar;telangana rashtra samithi trs;korcha;eatala rajendar;gangula kamalakar;mp;district;high court;huzur nagar;collector;chief minister;car;mla;minister;press;letter;medak;karimnagar;etela rajender;party;eshwar;mantraTue, 04 May 2021 17:00:00 GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ మరో షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే.. అయినా సరే ఈటల రాజేందర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేసీఆర్ మీద విమర్శల దాడి చేస్తూ ఉండడంతో ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ ను విమర్శిస్తున్నారు.. అయితే మరోపక్క ఈటల రాజేందర్ కు మరో షాక్ ఇచ్చేందుకు కూడా పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పార్టీలో ఉంటూ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు అన్న కారణంగా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టిఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేర్కొంటూ కరీంనగర్ టిఆర్ఎస్ నేతలు తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపినట్లు సమాచారం.. ఈటల వ్యవహారం గురించి చర్చించేందుకు గానూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

లేఖ మీద మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్ అలాగే మరి కొందరు ముఖ్య నేతలు సంతకాలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే మెదక్ జిల్లా భూకబ్జా ఆరోపణలకి సంబంధించిన భూముల మీద ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హెచరీస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ నివేదిక పూర్తిగా తప్పులతడకగా ఉందని పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇదంతా అధికారులు కారులో కూర్చుని నివేదిక రాసినట్లు అనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అర్ధరాత్రి అలికిడి.. నిద్ర లేచి చూస్తే.?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>