PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eatala7c0d2136-f1a1-4c58-9a34-0f3dcd592d06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eatala7c0d2136-f1a1-4c58-9a34-0f3dcd592d06-415x250-IndiaHerald.jpgఅచ్చంపేట వ‌ద్ద భూ క‌బ్జాల‌కు పాల్ప‌డ్డారంటూ ఈట‌ల‌పై ఆరోప‌ణ‌ల వ‌చ్చాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించారు. ఆంత‌టితో ఆగ‌కుండా ఈట‌ల వ‌ద్ద ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ‌ను త‌న‌కు బ‌ద‌లాయించుకున్నారు. విచార‌ణ‌లో ఈట‌ల క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు అధికారులు తేల్చిన వెంట‌నే ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నేడోరేపో ఈట‌ల రాజేంద‌ర్ అరెస్టుకుసైతం రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.eatala;view;kcr;telangana rashtra samithi trs;telangana;american samoa;cm;mla;minister;pettaదూకుడు పెంచిన ఈట‌ల‌.. మ‌రో ఉద్య‌మం మొద‌లైంద‌ట‌!దూకుడు పెంచిన ఈట‌ల‌.. మ‌రో ఉద్య‌మం మొద‌లైంద‌ట‌!eatala;view;kcr;telangana rashtra samithi trs;telangana;american samoa;cm;mla;minister;pettaTue, 04 May 2021 13:11:41 GMTతెరాస ఎమ్మెల్యే ఈట‌ల దూకుడు పెంచారు.. సీఎం కేసీఆర్ వ్యూహాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు త‌న ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే తాను దేనికైనా సిద్ధ‌మ‌ని చెప్పిన ఈట‌ల.. తాజాగా తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మం మొద‌లైందంటూ పేర్కొన‌డం ఆస‌క్తిని రేపుతుంది. సీఎం కేసీఆర్ అన్నివైపుల నుంచి ఈట‌ల‌ను ముట్ట‌డి చేస్తుంటే ఆ ప‌ద్మ‌వ్యూహం నుంచి ఈట‌ల ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారా అన్నచ‌ర్చ ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా సాగుతుంది.. ప్ర‌జ‌లే నా బ‌లం అంటున్న ఈట‌ల.. ఆత్మాభిమానం కోసం ఎంత‌కైనా ముందుకెళ్తానంటూ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

అచ్చంపేట వ‌ద్ద భూ క‌బ్జాల‌కు పాల్ప‌డ్డారంటూ ఈట‌ల‌పై ఆరోప‌ణ‌ల వ‌చ్చాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించారు. ఆంత‌టితో ఆగ‌కుండా ఈట‌ల వ‌ద్ద ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ‌ను త‌న‌కు బ‌ద‌లాయించుకున్నారు. విచార‌ణ‌లో ఈట‌ల క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు అధికారులు తేల్చిన వెంట‌నే ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నేడోరేపో ఈట‌ల రాజేంద‌ర్ అరెస్టుకుసైతం రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈట‌ల‌సైతం ఘాటుగానే స్పందించారు. త‌న‌పై క‌క్ష‌పూరితంగా సీఎం కేసీఆర్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతుంద‌ని, తాను చావ‌నైనా చ‌స్తాన‌ని, కానీ ఆత్మ‌గౌర‌వాన్ని మాత్రం కోల్పోన‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. దీనికితోడు దేనికైనా సిద్ధ‌మేనంటూ కేసీఆర్‌తో తేల్చుకునేందుకు ఈట‌ల సిద్ధ‌మ‌య్యారు.

ఈ క్ర‌మంలో ఈట‌ల మాట‌లు తూటాల్లా పేలుతున్నాయి. మంత్రివ‌ర్గంలో ఒక్క‌రు కూడా సంప‌తృప్తిగా లేర‌ని బాంబు పేల్చారు ఈట‌ల‌. సీఎం కేసీఆర్ త‌న గురువు అంటూనే.. త‌న‌కు కేసీఆర్‌తో 20యేళ్ల అనుబంధం ఉంద‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఒక్కొక‌టిగా బ‌య‌ట‌పెడ‌తానంటూ ఈట‌ల వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా తెలంగాణ ఎన్ఆర్ఐ అమెరికా ఫోరం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో ఈట‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మం మొద‌లైంద‌ని, అదే ఆత్మ గౌర‌వ ఉద్య‌మం అన్నారు. పూర్తిగా త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో న‌న్ను బ‌య‌ట‌కు పంపార‌ని, సిట్టింగ్ జ‌డ్జితో నా మొత్తం వ్యాపారం, సంపాదించిన ఆస్తుల మీద విచార‌ణ చేయించాల‌ని సీఎంను కోరాన‌ని అన్నారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశ‌ప‌డ‌న‌ని, ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్నాన‌ని.. ప్ర‌లోభాల‌కు లొంగ‌లేదు కాబ‌ట్టే ఈ నింద‌లు అంటూ ఈట‌ల  వ్యాఖ్యానించారు. తాజాగా ఈట‌ల వ్యాఖ్య‌ల‌ను చూస్తుంటే కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు అన్ని అస్త్రాలు సిద్ధంచేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు గుభేల్: రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్..!!

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>