MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-sudha-kongarac533d75f-2f88-4512-a6cb-55d89454d8d8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-sudha-kongarac533d75f-2f88-4512-a6cb-55d89454d8d8-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కానీ సినీ దర్శకురాలు అంటే మాత్రం , బాబోయ్ లేడీ డైరెక్టరా ఈమెం చేస్తోంది అన్న భావన చాలామందిలో ఉంది. అలాంటి ముద్రను చెరిపి తన సత్తా చాటుకుంది సుధ కొంగర. అయితే ఈమెకు అంత సులువుగా ఏమి అవకాశాలు దొరకలేదు. దర్శకురాలిగా మారడానికి ఎంతో కృషి చేసింది సుధ. DIRECTOR SUDHA KONGARA;mani ratnam;bhavana;krishna;krishna bhagawan;sudha;cinema;tamil;blockbuster hit;director;woman;research and analysis wing;nijam;sudha k prasad;chitramమణిరత్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన లేడీ డైరెక్టర్ ?మణిరత్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన లేడీ డైరెక్టర్ ?DIRECTOR SUDHA KONGARA;mani ratnam;bhavana;krishna;krishna bhagawan;sudha;cinema;tamil;blockbuster hit;director;woman;research and analysis wing;nijam;sudha k prasad;chitramTue, 04 May 2021 09:00:00 GMTనేటి సమాజంలో  మహిళలు  అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కానీ సినీ దర్శకురాలు అంటే మాత్రం , బాబోయ్ లేడీ డైరెక్టరా ఈమెం చేస్తోంది అన్న భావన చాలామందిలో ఉంది. అలాంటి ముద్రను చెరిపి తన సత్తా చాటుకుంది సుధ కొంగర. అయితే ఈమెకు అంత సులువుగా ఏమి అవకాశాలు దొరకలేదు.  దర్శకురాలిగా మారడానికి  ఎంతో కృషి చేసింది సుధ. ఎన్నో అవమానాలను, సూటి పోటి మాటలను ఎదుర్కొని వాటినన్నిటిని అధిగమించి నేడు మన ముందు సక్సెస్ఫుల్ దర్శకురాలిగా నిలబడ్డారు. 2008లో కృష్ణ భగవాన్ ప్రధాన పాత్రలో  తెరకెక్కిన ఆంధ్రా అందగాడు మూవీ తో డైరెక్టర్ గా పరిచయమయ్యింది సుధ. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్నీ ఈమెకు ఇవ్వలేదు.  దీంతో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది ఆ తర్వాత మణిరత్నం దగ్గర కొన్నేళ్లు శిష్యురాలిగా  పనిచేసింది. ఆతర్వాత తమిళంలో ద్రోహి చిత్రంతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేడు స్టార్ హీరోలను సైతం డైరెక్ట్ చేయగల టాలెంటెడ్ అండ్ పవర్ఫుల్ లేడీ డైరెక్టర్ గా పేరుగాంచింది. 

గురు, ఆకాశమే నీ హద్దురా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి  తన టాలెంట్ నిరూపించుకుంది. మేల్ స్టార్ దర్శకులకు ఏమాత్రం తీసిపోకుండా కథను ఎలివేట్ చేయగల దర్శకురాలిగా సత్తా చాటింది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుధ కొంగర పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లో సెట్స్ లో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కునే వారో చెప్పుకొచ్చారు.  సినిమా  అంటే ఎంతో మంది కళాకారుల కష్ట ఫలితం. ఇక షూటింగ్ సమయంలో 200 మందికి పైగా సెట్స్ లో వర్క్ చేస్తుంటారు. అంతమందికి టాయ్ లెట్స్ ఏర్పాటు చేయడం అంటే చిన్నవిషయమేమి  కాదు. అందులోనూ మహిళా కళాకారులకు సమప్రాదాన్యత ఇవ్వడం అనేది అప్పట్లో కష్టం.. కానీ మణిరత్నం సార్ దగ్గర మాత్రం నేను ఎప్పుడూ ఆ భేద భావాన్ని చూడలేదు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. 

ప్రతిభ  ఉంటే మహిళలైనా , మగవారినైనా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు. సెట్స్ లో మహిళా కళాకారులకి కూడా సమాన ప్రాధాన్యం అందేలా చూసేవారు. కానీ అప్పటి కాలంలో మహిళలకు  ప్రత్యేక టాయ్లెట్స్ అంటే కాస్త కష్టతరమైన విషయం. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. కానీ నేడు అదంతా ఎంతగానో మార్పు చెందింది. మహిళా సినీ కళాకారులకు తగిన ప్రోత్సాహం, గౌరవం  రెండు మెండుగా లభిస్తున్నాయి. అందుకు చాలా సంతోషం గా ఉంది. మారుతున్న కాలంతో పాటు మహిళ సాంకేతిక నిపుణులకు కూడా గౌరవవం , ప్రత్యేక ఆదరణ పెరగడం నిజంగా గొప్ప విషయమంటూ మణిరత్నం గారు గురించి చెప్పుకొచ్చారు సుధ కొంగర. అలా ఎన్నో సమస్యలను ఎదుర్కొని నేడు టాలెంటెడ్  డైరెక్టర్ గా అందరి ప్రశంసలను అందుకుంటుంన్న సుధ కు... స్టార్ హీరోలు సైతం పిలిచి మరి అవకాశం ఇస్తున్నారు. కృషి ఉంటే ఫలితం తప్పక అందుతుంది అనడానికి ఈమె మరో ఉదాహరణగా చెప్పచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>