PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-vista-project-2c97b9b7-8360-49c8-8d52-3b43f5a427df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-vista-project-2c97b9b7-8360-49c8-8d52-3b43f5a427df-415x250-IndiaHerald.jpgప్ర‌భుత్వం అంటే ప్ర‌జ‌ల‌కు ఏది అవ‌స‌ర‌మో తెలుసుకుని అదే చేయాలి. కానీ ప్ర‌స్థుతం అధికారంలో ఉన్న మోడీ స‌ర్కార్ అది వ‌దిలేసి సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో నిమ‌గ్న‌మైంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విళ‌య‌తాండవం చేస్తుంది. రోజుకు ల‌క్ష‌ల్లో కేసులు వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. మ‌రోవైపు దేశంలో తీవ్రంగా ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ ల కొర‌త‌..క‌రోనా ఔష‌దాల కొర‌త సైతం క‌నిపిస్తుంది. ఆక్సీజ‌న్ లేక ఔష‌దాలు దొర‌క్కే ప్ర‌జ‌ల ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. అంతే కాకుండా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్రైవైటు ఆస్ప‌central vista project;modi;india;mandula;december;central government;india gateమోడీ బంగ్లా @ 13 వేల కోట్లు ?మోడీ బంగ్లా @ 13 వేల కోట్లు ?central vista project;modi;india;mandula;december;central government;india gateTue, 04 May 2021 08:56:38 GMTమోడీ స‌ర్కార్ అది వ‌దిలేసి సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో నిమ‌గ్న‌మైంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విళ‌య‌తాండవం చేస్తుంది. రోజుకు ల‌క్ష‌ల్లో కేసులు వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. మ‌రోవైపు దేశంలో తీవ్రంగా ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ ల కొర‌త‌..క‌రోనా ఔష‌దాల కొర‌త సైతం క‌నిపిస్తుంది. ఆక్సీజ‌న్ లేక ఔష‌దాలు దొర‌క్కే ప్ర‌జ‌ల ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. అంతే కాకుండా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్రైవైటు ఆస్ప‌త్రుల్లో సైతం బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్రం దాదాపు 13 వేల కోట్ల రూపాయ‌ల‌తో సెంట్ర‌ల్ విస్టా ప్రాజ‌క్టు నిర్మాణాన్ని చేప‌డుతుందంటే దేశ ప్ర‌జ‌ల పై వారి ప్రాణాల‌పై ప్ర‌భుత్వానికి ఎంత ప‌ట్టింపు ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ ప్రాజ‌క్టును డిసెంబర్ 2022 క‌ల్లా పూర్తి చేయాల‌ని కేంద్రం నిర్న‌యించుకుంది. ప్ర‌ధాని భ‌వ‌నాన్ని డిసెంబ‌ర్ 2022 క‌ల్లా వైస్ ప్రెసిడెంట్ భ‌వ‌నాన్ని మే వ‌ర‌కు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా తాజాగా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం నోడల్ ఏజెన్సీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ (EAC) అవసరమైన క్లియరెన్స్ ఇచ్చింది.

కొత్త‌ నిర్మాణాలు చేప‌ట్ట‌డం పొర‌పాటు కాకున్నా ప్ర‌స్తుతం క‌రోనాతో వచ్చిన ఆర్థిక సంక్షోభం వేద‌న రోద‌నల మ‌ధ్య ఈ ప్రాజక్టు అవ‌స‌రమా అన్న ప్ర‌శ్న నెల‌కొంది. మాస్కులు, మందులు దొర‌క‌ని మ‌న దేశం సెంట్ర‌ల్ విస్టా ప్ర‌జ‌క్టుపై వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌డం దేనిక‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఇత‌ర విష‌యాల గురించి ప‌ట్టించుకోకుండా ఈ ప్రాజ‌క్టు నిర్మాణాన్ని చేప‌ట్టాల‌ని మోడీ వెంట ఉండే అధికారులతో పాటు ఆయ‌న‌ ప్ర‌ధాన వాస్తు శిల్పి బిమ‌ల్ ప‌టేల్ వెంట ప‌డ్డార‌ట‌. హిందూ పురాణాలు చెప్పె శ్రీ యంత్ర‌కు త‌గిన‌ట్టుగా త్రిమూర్తుల‌కు ప్ర‌తీక‌గా ఈ భ‌వ‌నం త్రికోణాకారంలో ఉంటుంద‌ట‌. ఈ భ‌వ‌నం రాష్ట్ర ప‌తి భ‌వ‌న్ ద‌గ్గ‌ర మొద‌లై ఇండియా గేట్ వ‌ర‌కూ ఉంటుంది. ఈ సెంట్ర‌ల్ విస్టాతో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, కేంద్ర స‌చివాల‌యం అన్నీ క‌లిసిపోతాయి. మ‌న‌క‌న్నా ప్రాచీన‌మైన బ్రిటిష్ పార్ల‌మెంట్ భ‌వ‌నాన్నే ఇప్ప‌టి వ‌ర‌కూ మార్చ‌లేదు. అక్క‌డ కంటే మ‌న ఎంపీల‌కు ఒక‌టిన్న‌ర రెట్ల స్థ‌లం అందుబాటులో ఉంటుంద‌ని అంచ‌నా...అంతే కాకుండా ప్ర‌స్తుతం ఉన్న మ‌న భ‌వ‌నానికి భూకంప ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నా దానికి ఎలాంటి ఆధారాలు లేవు. దాంతో ఈ ప్రాజ‌క్టుపై తీవ్ర విమ‌ర్శలు ఎదురౌతున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>