PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తునే ఉన్నాం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ప్రతీ విషయంలో కూడా ఆయన సిఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కాస్త సీరియస్ గా దృష్టి సారించారు. తాజాగా బండి సంజయ్... జూమ్ మీడియా సమbandi sanajy,bjp,ts;health;kcr;santoshi;bharatiya janata party;korcha;telangana;media;chief minister;vegetable market;central government;oxygen;houseమారువేషంలో ఆస్పత్రులకు కేటిఆర్...?మారువేషంలో ఆస్పత్రులకు కేటిఆర్...?bandi sanajy,bjp,ts;health;kcr;santoshi;bharatiya janata party;korcha;telangana;media;chief minister;vegetable market;central government;oxygen;houseTue, 04 May 2021 09:22:58 GMTతెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తునే ఉన్నాం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ప్రతీ విషయంలో కూడా ఆయన సిఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కాస్త సీరియస్ గా దృష్టి సారించారు.

తాజాగా బండి సంజయ్... జూమ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జన్సీ విధించాలన్న బీజేపీ అధ్యక్షుడు... కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసారు. వైద్య, ఆరోగ్యశాఖను తీసుకుని ఫాంహౌస్ లో కూర్చుంటే ఉపయోగంలేదు అని ఆయన ఆరోపించారు. కక్ష సాధింపులకు ఉన్న సమయం ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యంపై లేకపోవటం బాధాకరం అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు.

కరోనా నియంత్రణ కోసం కూడా నలుగురు ఐఏఎస్ అధికారులను నియమిస్తే సంతోషించేవాళ్ళం అని అన్నారు. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్, ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవటంలో ప్రభుత్వం విఫలం అని ఆయన మండిపడ్డారు. అదే విధంగా... పాలకులకు మానవత్వం లేకుంటే ప్రజల ప్రాణాలకే ముప్పు అని బండి సంజయ్ హెచ్చరించారు. శ్మశానవాటికలో కెమెరాలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కనీసం మారు వేషంలో అయినా కేసీఆర్ ఆసుపత్రులను పరిశీలించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం కలుగజేసుకోదు అని ఆయన స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటోంది అని అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ లో కుక్కకు ఉన్న విలువ తెలంగాణ ప్రజల ప్రాణాలకు  లేదు అని మండిపడ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>