MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari-birthday-speciald7a83c7b-562e-476d-8578-5c093bb9dcbd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari-birthday-speciald7a83c7b-562e-476d-8578-5c093bb9dcbd-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం దర్శకరత్న దాసరి నారాయణరావు. దాసరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అనే గ్రామంలో మే 4,1942 లో జన్మించారు. ఈయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. తాను చనిపోయే ముందు వరకు కూడా సినీ ఇండస్ట్రీ బాగు కోసం కృషి చేసిన మహానుభావుడు. ఈయనకు సినిమా రంగంలో చేసిన నిరంతర సేవలకు గానూ ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి.DASARI-BIRTHDAY-SPECIAL;ntr;nagarjuna akkineni;sridevi kapoor;vijayashanti;editor mohan;jeevitha rajaseskhar;murali mohan;nageshwara rao akkineni;prema;ramu;sujatha;godavari river;రాజీనామా;district;industries;cinema;west godavari;village;love;film industry;industry;blockbuster hit;nandamuri taraka rama rao;romantic;osey ramulamma;chitramదాసరి డైరెక్ట్ చేసిన బెస్ట్ 10 మూవీస్ ఇవే ... ?దాసరి డైరెక్ట్ చేసిన బెస్ట్ 10 మూవీస్ ఇవే ... ?DASARI-BIRTHDAY-SPECIAL;ntr;nagarjuna akkineni;sridevi kapoor;vijayashanti;editor mohan;jeevitha rajaseskhar;murali mohan;nageshwara rao akkineni;prema;ramu;sujatha;godavari river;రాజీనామా;district;industries;cinema;west godavari;village;love;film industry;industry;blockbuster hit;nandamuri taraka rama rao;romantic;osey ramulamma;chitramTue, 04 May 2021 11:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం దర్శకరత్న దాసరి నారాయణరావు. దాసరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అనే గ్రామంలో మే 4,1942 లో జన్మించారు. ఈయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. తాను చనిపోయే ముందు వరకు కూడా సినీ ఇండస్ట్రీ బాగు కోసం కృషి చేసిన మహానుభావుడు. ఈయనకు సినిమా రంగంలో చేసిన నిరంతర సేవలకు గానూ ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. దాసరి తన సినీ జీవిత కాలంలో 151 సినిమాలకు దర్శకత్వం వహించి, అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. అంతే కాకుండా 53 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మరియు 250 సినిమాలకు రచయితగా పనిచేసిన ఘనుడు. ఈయన తన సీనీ జీవితంలో ఎన్నో మరుపురాని చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

సినీ పరిశ్రమకు అత్యంత అరుదుగా ఇలాంటి వారు దొరుకుతారని చాలా మంది పెద్దవాళ్ళు సభలలో చెబుతూ ఉండేవారు. ఈ రోజు సినీ పరిశ్రమ ఒక మంచి స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం దాసరి నారాయణరావు అని గర్వంగా చెప్పవచ్చు. దాసరి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం "తాతా మనవడు"... ఈ సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. దాసరి సినిమాలలో ఒక ప్రత్యేకత ఉంటుంది.. తనకే ఇలా జరిగితే ఏ విధంగా ఉంటుంది అని ఊహించి సినిమాలను తెరకెక్కిస్తాడు. అందుకే చాలా వరకు సినిమాలు విజయాన్ని సాధించాయి. సామాజిక స్పృహ, మానవీయ దృక్పధం, మానవతా విలువలు కలగలిపి కథను అల్లడంలో సిద్ధహస్తుడు దాసరి. దాసరి సినిమాలలో కొన్ని ముఖ్యమైన సినిమాలు ఇప్పటికే గుర్తుండి పోయే కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.

తన సినీ జీవితంలో తెరకెక్కించిన రెండవ సినిమా "స్వర్గం నరకం". ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకొంది. ఇందులో మోహన్ బాబు మురళీమోహన్ నటించారు. ఈ సినిమా మోహన్ బాబు కు మంచి పేరును తీసుకువచ్చింది. మరొక మూవీ "అమ్మ రాజీనామా"...ఈ సినిమాలో అమ్మ గొప్పతనం గురించి చెప్పిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తుంది. ఈ సినిమా ద్వారా ఇందులో నటించిన నటులకు మరిన్ని అవకాశాలు వచ్చాయని చెప్పవచ్చు. దాసరి దర్శకత్వ ప్రతిభ ద్వారా రూపుదిద్దుకున్న సినిమా "ఒసేయ్ రాములమ్మ" ఇది అప్పట్లో ఒక సంచలనం విజయశాంతి పాత్రను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేరు. అంతగా ఈ పాత్ర అభిమానుల మనసులో నిలిచిపోయింది. నందమూరి తారకరామారావు మరియు శ్రీదేవి నటించిన సర్దార్ పాపారాయుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ నటన మరియు దాసరి దర్శకత్వ ప్రతిభ ముందు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అక్కినేని నాగేశ్వరావు కెరీర్ లో గుర్తిండిపోయే రెండు సినిమాలను అందించాడు దాసరి. వాటిలో మేఘసందేశం మొదటిది మరియు ప్రేమాభిషేకం మూవీ రెండవది. ఈ రెండు సినిమాలలో ప్రేమను గురించి చెప్పిన డైలాగులు ఇప్పటికీ రికార్డు. అక్కినేని నటన ఈ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తరువాత శివరంజని సినిమాతో మరో సంచలన విజయాన్ని సాధించాడు దాసరి. ఇందులో వచ్చే టైటిల్ సాంగ్ ఇప్పటికీ ప్రజల మనసులో గుర్తిండిపోయింది. దాసరి ఎన్టీఆర్ తో చేసిన రెండవ చిత్రం బొబ్బిలిపులి...ఇందులో లాయర్ గా నటించిన శ్రీదేవి పాత్రను అద్భుతంగా మలిచారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శోభన్ బాబు సుజాత జంటగా నటించిన గోరింటాకు చిత్రం ఒక కుటుంబ కథ చిత్రంగా ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇకపోతే నాగార్జున సినీ జీవితంలో ఎప్పటికీ చెప్పుకునే ..గుర్తిండిపోయే చిత్రంగా మజ్ను చిత్రం నిలుస్తుంది. ఈ సినిమాలో ప్రేమ దాని వలన కలిగే కష్టాలు చాలా చక్కగా వివవరించారు. ఇలా దాసరి సినీ జీవితంలో ఈ 10 సినిమాలు ఉత్తమంగా నిలుస్తాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్: జైలులో ఉన్న ఆ డైరక్టర్ కు కరోనా..!!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>