BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtb41abc70-044f-4d10-b05c-33ed4de17223-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtb41abc70-044f-4d10-b05c-33ed4de17223-415x250-IndiaHerald.jpg మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో ఈటల కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌‌కు సంబంధించిన భూముల వ్యవహారంలో హైకోర్టులో వాడివేడిగా చర్చలు జరిగాయి. మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించడం.. అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం గురించి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసhighcourt;jamuna;telangana;district;high court;collector;car;survey;lawyer;minister;lieఈటల వ్యవహారంలో షాకైన హైకోర్టు..!!ఈటల వ్యవహారంలో షాకైన హైకోర్టు..!!highcourt;jamuna;telangana;district;high court;collector;car;survey;lawyer;minister;lieTue, 04 May 2021 16:42:46 GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో ఈటల కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌‌కు సంబంధించిన భూముల వ్యవహారంలో హైకోర్టులో వాడివేడిగా చర్చలు జరిగాయి. మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించడం.. అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం గురించి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.  

సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నివేదికను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. కలెక్టర్ నివేదికతో సంబంధం లేకుండా చట్టప్రకారం వ్యవహరించాలని సూచించింది. అధికారులు కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని ఆదేశించింది.మే 1,2 న జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అర్ధరాత్రి అలికిడి.. నిద్ర లేచి చూస్తే.?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>