CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/grandfather-and-grandmother-commit-suicide-for-granddaughter-because15f11fa1-dab6-45d7-8da9-60db479e3b2a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/grandfather-and-grandmother-commit-suicide-for-granddaughter-because15f11fa1-dab6-45d7-8da9-60db479e3b2a-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కోవిడ్ సోకిన తమ ద్వారా, మనవడికి కూడా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజ‌స్థాన్‌లోని కోటా ప్రాంతంలో చోటుచేసుకుంది. suicide;mumbai;delhi;police;wife;traffic police;house;coronavirusమనవడి కోసం తాత, నానమ్మ ఆత్మహత్య.. ఎందుకంటే..!మనవడి కోసం తాత, నానమ్మ ఆత్మహత్య.. ఎందుకంటే..!suicide;mumbai;delhi;police;wife;traffic police;house;coronavirusTue, 04 May 2021 21:04:39 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కోవిడ్ సోకిన తమ ద్వారా, మనవడికి కూడా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజ‌స్థాన్‌లోని కోటా ప్రాంతంలో చోటుచేసుకుంది. క‌రోనా పాజిటివ్‌గా తేలిన 75 ఏళ్ల హీరాలాల్ బైర్వా, ఆయ‌న భార్య 70 ఏళ్ల శాంతీ బాయి ఇద్ద‌రు రైలు కింద ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం నాడు జ‌రిగిన ఈ ఘ‌ట‌న రైల్వే కాల‌నీ పోలీస్ స్టేష‌న్ పరిధిలో చోటుచేసుకుంది. ఛంబల్ పైవంతెన ద‌గ్గ‌రున్న ఢిల్లీ-ముంబై అప్‌లైన్ ప‌ట్టాల‌పై రైలు పట్టాలపై పడిఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

క‌రోనా పాజిటివ్ వ‌చ్చి, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న బాధితులు ఇద్దరూ.. త‌మ ద్వారా మ‌న‌వ‌డికీ క‌రోనా సోకుతుందేమోన‌నే భ‌యంతో ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తెలిసింది. ఈ ఘటనపై సెక్ష‌న్ 174 కింద కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్టారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇద్దరి మృత‌దేహాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

ఇక చనిపోయిన వృద్ధ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఎనిమిదేళ్ల క్రితం చ‌నిపోయాడు. ప్ర‌స్తుతం కోటా సమీపంలోని పురోహిత్‌జీ కీ తప్రీ ప్రాంతంలో త‌మ కోడ‌లు, 18 ఏళ్ల మ‌న‌వ‌డితో క‌లిసి నివసిస్తున్నారు. వీరిద్ద‌రికీ ఏప్రిల్ 29న కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. ఇదే విష‌యాన్ని రైల్వే కాల‌నీ పోలీస్ స్టేష‌న్ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ ర‌మేష్ చంద్ శ‌ర్మ కూడా ధ్రువీక‌రించారు.

కానీ.. తమ ద్వారా కుటుంబం మొత్తానికి మ‌హ‌మ్మారి సోకుతుందేమోన‌నే భ‌యం వీరిని మ‌రింత వేద‌న‌కు గురిచేసింది. అందువల్ల ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ సోకినవారు మనోధైర్యంతో ఉంటేనే మహమ్మారిని ఎదుర్కోగలమని నిపుణులు చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం అనవసర భయాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ - త్రివిక్రమ్ మూవీ కి సంబందించిన ఆ న్యూస్ ఫేక్ అట ..... ??

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>