MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/dasari-narayana-raoc69691bd-9131-4727-924a-447dfb8b5e6c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/dasari-narayana-raoc69691bd-9131-4727-924a-447dfb8b5e6c-415x250-IndiaHerald.jpgఅతి కొద్దిమంది మాత్రమే చనిపోయిన సరే తన జ్ఞాపకాలతో జనాల ఆలోచనల్లో బ్రతికే ఉంటారు. అలాంటి అతి కొద్దిమందిలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. ఆయన భౌతికంగా దూరమై నాలుగేళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీ పెద్ద అనే మాట గుర్తు రాగానే ఆయన గుర్తొస్తారు.. తెలుగు ఇండస్ట్రీ మీద దాసరిది ఒక చెరిగిపోని జ్ఞాపకం, ఒక చెరపలేని సంతకం. సుమారు 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన దర్శకుడు దాసరి. టాప్ హీరో మొదలు ముక్కు మొహం తెలియని వారితో సైతం సినిమాలు రూపొందింdasari;dasari narayana rao;cinema;telugu;tamil;kannada;hindi;industry;heroసిసలైన అందరివాడు... దాసరి!సిసలైన అందరివాడు... దాసరి!dasari;dasari narayana rao;cinema;telugu;tamil;kannada;hindi;industry;heroTue, 04 May 2021 08:00:00 GMTఅతి కొద్దిమంది మాత్రమే చనిపోయిన సరే తన జ్ఞాపకాలతో జనాల ఆలోచనల్లో బ్రతికే ఉంటారు. అలాంటి అతి కొద్దిమందిలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. ఆయన భౌతికంగా దూరమై నాలుగేళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీ పెద్ద అనే మాట గుర్తు రాగానే ఆయన గుర్తొస్తారు.. తెలుగు ఇండస్ట్రీ మీద దాసరిది ఒక చెరిగిపోని జ్ఞాపకం, ఒక చెరపలేని సంతకం. సుమారు 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన దర్శకుడు దాసరి. టాప్ హీరో మొదలు ముక్కు మొహం తెలియని వారితో సైతం సినిమాలు రూపొందించిన ఘనత సంపాదించారు. దాసరి పరిచయం చేసిన వాళ్లలో చాలామంది ఇప్పుడు హీరోలుగా ఇతర ఇతర విభాగాల్లోనో రాణిస్తున్నారు. 

దాసరి సినిమాల ద్వారా ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అవకాశాలు దక్కిన వాళ్లు స్టార్స్ గా ఎదిగారు అవకాశాలు అంతగా దక్కని వారు ఇండస్ట్రీలో ఏదో ఒక రూపంలో తమ సత్తా చాటుతున్నారు. నిజానికి తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించిన దాసరి ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచేవారు.. అర్ధరాత్రి సమయంలో ఇబ్బంది కలిగిందని ఆయన ఇంటికి వెళ్ళినా తగిన న్యాయం చేస్తారని సినీ జనాలు భావించేవారు. అందుకే ఇప్పటికీ అసలుసిసలైన అందరివాడు అంటే దాసరి అని మాత్రమే సినీ జనం భావిస్తూ ఉంటారు. 

తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన దాసరి నారాయణ రావు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత రాజకీయ ఆరంగ్రేటం చేసినా సినిమాను వదలలేదు. తన తొలి సినిమా తాతా-మనవడు మొదలు దాదాపు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ సామాజికంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేవారు. ఆ సమస్యలను ఎదుర్కొనేందుకు సైతం తగిన మార్గాలు చూపించేవారు. దాసరి భౌతికంగా దూరమై ఏళ్లు గడుస్తున్నా ఆయన ఇంకా తమ మధ్య ఉన్నారని సినీ జనం భావిస్తూ ఉండడం ఆయనకు దక్కిన నిజమైన నివాళిగా చెప్పచ్చు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకు అండగా సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>