EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/saradpawar4b90392b-73a2-4aa1-ae20-3b83af43e860-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/saradpawar4b90392b-73a2-4aa1-ae20-3b83af43e860-415x250-IndiaHerald.jpgశ‌ర‌ద్‌ప‌వార్.. దేశంలోని అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ‌నాయ‌కుల్లో ప్ర‌ముఖుడు. మ‌హారాష్ట్ర‌లో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన‌ నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌. ఆయ‌న ఘ‌న‌త అంత‌మాత్ర‌మే కాదు. పూర్వాశ్ర‌మంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌. పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూ గా వెలుగొందిన వ్య‌క్తి. కేంద్రంలో ప్రాధాన్య‌మున్న మంత్రిత్వ శాఖ‌లను నిర్వ‌హించిన అనుభ‌వం ఆయ‌న సొంతం. saradpawar;view;modi;mamata benerjee;anu malik;benarjee;bharatiya janata party;maharashtra - mumbai;sharad pawar;congress;2019;loksabha;minister;maharashtra;cheque;central government;nawab malik;partyమోదీషాల ఆట క‌ట్టించేందుకు మ‌రో మొగుడు రెడీ..?మోదీషాల ఆట క‌ట్టించేందుకు మ‌రో మొగుడు రెడీ..?saradpawar;view;modi;mamata benerjee;anu malik;benarjee;bharatiya janata party;maharashtra - mumbai;sharad pawar;congress;2019;loksabha;minister;maharashtra;cheque;central government;nawab malik;partyTue, 04 May 2021 18:55:00 GMTశ‌ర‌ద్‌ప‌వార్.. దేశంలోని అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ‌నాయ‌కుల్లో ప్ర‌ముఖుడు. మ‌హారాష్ట్ర‌లో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన‌ నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌. ఆయ‌న ఘ‌న‌త అంత‌మాత్ర‌మే కాదు. పూర్వాశ్ర‌మంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌. పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూ గా వెలుగొందిన వ్య‌క్తి. కేంద్రంలో ప్రాధాన్య‌మున్న మంత్రిత్వ శాఖ‌లను నిర్వ‌హించిన అనుభ‌వం ఆయ‌న సొంతం. అంతేకాదు.. సోనియాగాంధీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్ట‌డాన్ని పార్టీలో ఉంటూనే తీవ్రంగా వ్య‌తిరేకించిన ఏకైక నాయ‌కుడు. ఎందుకంటే సీనియారిటీ, స‌మ‌ర్థ‌త ప్ర‌కారం ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌ధాని ప‌ద‌వి అభ్య‌ర్థిత్వానికి తానే అర్హుడిన‌న్న‌ది ఆయ‌న న‌మ్మ‌కం. ఆకార‌ణంగానే కాంగ్రెస్‌ పార్టీ నించి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంత కుంప‌టి పెట్టుకున్న చ‌రిత్ర ఆయ‌న‌ది. అప్ప‌టినించి మ‌హారాష్ట్ర వ‌ర‌కే ఆయ‌న రాజ‌కీయాలు ప‌రిమిత‌మైనా కేంద్ర రాజ‌కీయాల‌పై ఆయ‌న మ‌క్కువ వీడ‌లేద‌నే చెప్పాలి. అయితే మోడీ ఆధ్వ‌ర్యంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాకా రాజ‌కీయాల్లో పెనుమార్పులు వ‌చ్చాయి. బీజేపీ అప్ర‌తిహ‌త జైత్ర‌యాత్ర‌తో విప‌క్షాల ప్రాభ‌వం త‌గ్గింది.

దీంతో కొంత‌కాలం మౌనంగా ఉన్న శ‌ర‌ద్‌ప‌వార్ కు కొంత‌కాలంగా కాలం క‌లిసివ‌స్తోంది. మోడీషాల ఆధిప‌త్య రాజ‌కీయ ధోర‌ణి స‌హించ‌లేక తీవ్ర అసంతృప్తితో ఉన్న శివ‌సేన‌ను 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌ రాజ‌కీయ చాణ‌క్యంతో త‌న‌వైపుకు తిప్పుకుని మ‌హారాష్ట్ర‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి బీజేపీకి షాక్ ఇచ్చారు ఈ మ‌రాఠా నేత‌. ఈ నేప‌థ్యంలోనే శ‌ర‌ద్‌ప‌వార్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా వ్యూహాలు ర‌చించి అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జ‌రిగిన‌ ఐదు రాష్ట్రాల‌ శాసన సభల ఎన్నికల ఫలితాలు ఎన్సీపీకి ఉత్సాహాన్ని క‌లిగించిన‌ట్టు ఆ పార్టీ స్పంద‌న చెపుతోంది.  రాబోయే లోక్‌సభ ఎన్నికలపై తాము ఇప్ప‌టినించే దృష్టి సారించామ‌ని, తమ అధినేత శరద్ పవార్ ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తారని ఆ పార్టీ తాజాగా ప్ర‌క‌టించింది. ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేయడానికి త‌మ పార్టీ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్ర‌కటించ‌డం దీనినే సూచిస్తోంది

ఇప్ప‌టికే మోడీషాల ఆధ్వ‌ర్యంలోని బీజేపీని ఎదుర్కోవ‌డానికి ప్రతిపక్షాలు ఏకమవడం చాలా అవసరమని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ వెలిబుచ్చిన అభిప్రాయాల‌ను కూడా నవాబ్ మాలిక్ ప్రస్తావించడం విశేషం. వాస్త‌వానికి శ‌ర‌ద్‌ప‌వార్ కు మ‌మ‌తాబెన‌ర్జీకి కొన్ని విష‌యాల్లో సారూప్యాలున్నాయి. ఇద్ద‌రూ ఒక‌నాటి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే. ఆ పార్టీ విధానాల‌తో విభేదించి సొంత పార్టీలు పెట్టుకుని త‌మ‌దైన శైలిలో రాజకీయాలు సాగిస్తున్న‌వారే. ఇప్ప‌డు కాంగ్రెస్ పార్టీ ప‌లు రాష్ట్రాల్లో బ‌ల‌హీన‌ప‌డి అధికార బీజేపీకి దీటుగా నిల‌వ‌లేకపోతున్న స‌మ‌యంలో ఈ ఇరువురు నేత‌లు మాత్రం బీజేపీకి స‌వాల్ విసురుతుండ‌టం రాజ‌కీయ వైచిత్రి. మొత్తంమీద దేశంలో భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌పై వీరి ప్ర‌భావం ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రమేన‌ని చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ కంటే పెద్ద స్టార్ ఎవరంటే .... సంచలన కామెంట్స్ చేసిన వర్మ .... ??

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>