PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfea93591-0e5c-4a21-a566-fdfa358b9b16-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfea93591-0e5c-4a21-a566-fdfa358b9b16-415x250-IndiaHerald.jpgప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలం అవుతుంది. ముఖ్యంగా భారతదేశంలో కేసులు మితిమీరిపోతున్నాయి.రోజుకి ఎంతో మంది ఈ వైరస్ వలన చనిపోతున్నారు.అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేశానికి ఉన్న ఏకైక ఆశాకిరణం వ్యాక్సినేషన్. దీన్ని సాధ్యం చేస్తున్న సంస్థల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. భారత్‌లో ప్రభుత్వ అనుమతులు పొంది, ప్రజలకు వేస్తున్న వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ ఒకటి. దీన్ని తయారు చేసిన సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్. ప్రపంచంలో వ్యాక్సిన్లు తయారుచేసే ప్రముఖ సంస్థల్లో ఒకటైన ఇది ఎలా ప్రారంభమైందో తెలcoronavirus;mithra;india;interview;doctor;success;massయువతకి స్ఫూర్తి ..పూనావాలా..యువతకి స్ఫూర్తి ..పూనావాలా..coronavirus;mithra;india;interview;doctor;success;massTue, 04 May 2021 18:24:38 GMTఇండియా ఒకటి. భారత్‌లో ప్రభుత్వ అనుమతులు పొంది, ప్రజలకు వేస్తున్న వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ ఒకటి. దీన్ని తయారు చేసిన సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్. ప్రపంచంలో వ్యాక్సిన్లు తయారుచేసే ప్రముఖ సంస్థల్లో ఒకటైన ఇది ఎలా ప్రారంభమైందో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..ఇక వివరాల్లోకి వెళితే..మొదట్లో పూనావాలా కుటుంబం గుర్రాలు పెంచుకునేది. ఈ క్రమంలోనే డాక్టర్ సైరస్ పూనావాలాకు 70 ఎకరాల్లో ఉన్న గుర్రాల పెంచుకునే ప్రాంతం వారసత్వంగా దక్కింది.

ఆ వ్యాపారాన్ని మరింత పెంచి, గుర్రాల వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచారు సైరస్ పూనావాలా. ఆ తర్వాత అనుకోకుండా ఒకసారి తన మిత్రుడైన ఒక వెటర్నరీ డాక్టరుతో మాట్లాడిన సైరస్ పూనావాలాకు.. వ్యాక్సిన్ ఉత్పత్తి వ్యాపారం చేయాలని అనిపించింది. ఇలా యాదృచ్ఛికంగా ప్రారంభమైన సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్. ప్రస్తుతం ఇది 12.8 బిలియన్ డాలర్ల కంపెనీ. దీన్ని స్థాపించిన సైరస్ పూనావాలా.. భారత్‌లో అత్యంత సంపన్న కుబేరుల్లో 7వ వ్యక్తి కావడం విశేషం.పూనావాలా గుర్రాల పెంపకం శాలలో ముసలివైన గుర్రాలను ముంబైలోని హాఫ్‌కైన్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపేవారు.


అక్కడ వాటి సీరమ్ నుంచి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేవారు. అయితే ఈ టీకాలను వారు భారీగా ఉత్పత్తి చేసేవారు కాదు. దీంతో ఎక్కువ శాతం టీకాలను భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇదే విషయం మిత్రునితో సంభాషణ మధ్యలో రావడంతో పూనావాలాకు దానిలో అవకాశం కనిపించింది. అప్పుడే సోదరుడు జావరీతో కలిసి గుర్రాలను అమ్మేశారు. ఇలా అమ్మగా వచ్చిన 12వేల డాలర్లతో 1966లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. అయితే ఈ రంగంలో అవకాశాలు ఉన్నప్పటికీ అది వారికి కొత్త. అనుభవం లేదు. ఈ సమస్యను అధిగమించడం కోసం హాఫ్‌కైన్ నుంచి ముగ్గురు డాక్టర్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పూనావాలాతోనే ప్రయాణం చేస్తున్న ఈ ముగ్గురు వైద్యులు.. ప్రస్తుతం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో బోర్డు మెంబర్లుగా ఉన్నారు.

ఇప్పుడు ప్రపంచంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సంస్థల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఒకటి. ఇది ఎంతగా ఈ రంగంలో ఎదిగిందంటే.. ఒక ఇంటర్వ్యూలో పూనావాలా మాట్లాడుతూ ''కోకాకోలా, పెప్సికో వంటి కంపెనీలు కలలో కూడా ఊహించలేనంత మందికి మా ఉత్పత్తులు అందుతున్నాయి'' అని చెప్పారు. దీన్నిబట్టే ఈ కంపెనీ ప్రపంచంలో ఎంతలా విస్తరించిందో తెలుసుకోవచ్చు. ఈరోజు భారత్‌లో కరోనా మహమ్మారి అణచడంలో కూడా ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించగానే మాస్ ప్రొడక్షన్ ప్రారంభించడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రెడీగా ఉందట.

అయితే మాములుగా ఒక వ్యాక్సిన్‌కు ప్రభుత్వ అనుమతి లభించాలంటే నాలుగైదేళ్లు పడుతుందని, అయితే యూకేలో తమ వ్యాక్సిన్ ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ 80 శాతం సక్సెస్ అవుతుందని పూనావాలా చెప్పారు. అప్పటికల్లా భారత్‌కేకాక, ఇతర దేశాలకు కూడా లక్షల డోసుల వ్యాక్సిన్ అందించడానికి తమ సంస్థ సిద్దంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలా గుర్రాల పెంపకంతో మొదలైన కంపెనీ నేడు ప్రపంచంలో కోట్లాదిమంది ప్రాణాలను కాపాడుతూ దినదినాభివృద్ధి చెందడం ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>