PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-1ec63e15-7ca6-478a-a7df-45be04c8be86-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-1ec63e15-7ca6-478a-a7df-45be04c8be86-415x250-IndiaHerald.jpgఆశలు వేరు, ఆకాంక్షలు వేరు. ఆచరణ వేరు. వీటికి లింక్ కుదిరితేనే సూపర్ హిట్ అని అంటారు. లేకపోతే వ్యవహారం మొత్తం ఫట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక చెప్పుకోవాలంటే ప్రతీ రాజకీయ నాయ‌కుడికీ కొన్ని కోరికలు ఉంటాయి. jagan;maheswari;jagan;amaravati;vishakapatnam;mantraజగన్ కు గట్టి షాక్ అలా తగిలిందా... ?జగన్ కు గట్టి షాక్ అలా తగిలిందా... ?jagan;maheswari;jagan;amaravati;vishakapatnam;mantraTue, 04 May 2021 10:00:00 GMTఆశలు వేరు, ఆకాంక్షలు వేరు. ఆచరణ వేరు. వీటికి లింక్ కుదిరితేనే సూపర్ హిట్ అని అంటారు. లేకపోతే వ్యవహారం మొత్తం ఫట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక చెప్పుకోవాలంటే ప్రతీ రాజకీయ నాయ‌కుడికీ కొన్ని కోరికలు ఉంటాయి.

అలాగే జగన్ కి కూడా చాలా ఉన్నాయి. అందులో  అతి ముఖ్యమనైనది మూడు రాజధానులు. ఆయన అధికారంలోకి వస్తూనే అమరావతి మీద తన మంత్రులతో  చెప్పాల్సింది చెప్పించారు. ఆరు నెలల తరువాత తాపీగా శాసన సభలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. దాని మీద అమరావతి రైతులు ఆందోళన మొదలెట్టారు. వారికి మొత్తం విపక్షం మద్దతు ఇచ్చింది.

ఇక ఇప్పటికీ వారంతా ఆందోళలను చేస్తూనే ఉన్నారు. ఇక ఈ అంశం కోర్టు లో కూడా ఉంది. విచారణ ఒక కొలిక్కి వచ్చాక నాటి హై కోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి అసోం కి బదిలీ అయ్యారు. గోస్వామి ఏపీకి కొత్త చీఫ్ జస్టిస్ గా వచ్చారు. ఈ నేపధ్యంలో తాజాగా మళ్లీ మొదటి నుంచి మూడు రాజధానుల మీద విచారణ మొదలైంది. అయితే ఇంతలోనే అవాంతరం ఎదురైంది.

ఒక వైపు వీర విహారం చేస్తున్న కరోనా నేపధ్యంలో ఈ కేసు రోజు వారీ విచారణను వాయిదా వేశారు. ఆగస్త్  23 నాటికి ఈ కేసు వాయిదా పడడంతో మరో మూడున్నర నెలల వరకూ మూడు రాజధానుల కేసు విచారణ ఉండదు. ఆ తరువాత మొదలైనా విచారణ పూర్తి అయి తీర్పు రావడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. మొత్తానికి చూస్తే జగన్ మూడు రాజధానుల ఆశలు అలాగే ఉండిపోతున్నాయి. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేనా అన్న డౌట్ కూడా వస్తోంది. కరోనా మహమ్మారి తోనే ఇలా జగన్ కి గట్టి షాక్ తగిలింది అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులోనైనా జగన్ చలో విశాఖ కోరిక తీరుతుందో లేదో.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ళు దాటిన వాళ్లకు నేడు జగనన్న గుడ్ న్యూస్...?

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>