MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpgనందమూరి అభిమానులు చాలా కాలంగా తమ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని చాలా ఆసక్తి చూపిస్తున్నారు.. హీరోలు కూడా సరైన కథ వస్తే చేయడానికి సిద్ధమేనని ఎన్నో సార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు వారి కోరిక తీరేలానే కనిపిస్తుంది. రచయితగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి పటాస్ సినిమా తో అనిల్ రావిపూడి దర్శకుడిగా మారారు. ఇప్పటికీ ఆయన ఒక్క ఫ్లాప్ సినిమా కూడా ఇవ్వలేదు. చేసిన అన్ని సినిమాలతో హిట్స్ కొడుతూ ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే తాను దర్శకుడిగా మారడానికి తన తొలి అవకాశం ఇచ్చిన కళ్యాanil ravipudi;balakrishna;anil music;anil ravipudi;kalyan;kalyan ram;ram pothineni;cinema;nandamuri balakrishna;f2;director;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;pattasనందమూరి ఫ్యాన్స్ కోరిక తీరుస్తున్న అనిల్ రావిపూడినందమూరి ఫ్యాన్స్ కోరిక తీరుస్తున్న అనిల్ రావిపూడిanil ravipudi;balakrishna;anil music;anil ravipudi;kalyan;kalyan ram;ram pothineni;cinema;nandamuri balakrishna;f2;director;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;pattasTue, 04 May 2021 09:00:00 GMTనందమూరి అభిమానులు చాలా కాలంగా తమ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని చాలా ఆసక్తి చూపిస్తున్నారు.. హీరోలు కూడా సరైన కథ వస్తే చేయడానికి సిద్ధమేనని ఎన్నో సార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు వారి కోరిక తీరేలానే కనిపిస్తుంది. రచయితగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి పటాస్ సినిమా తో అనిల్ రావిపూడి దర్శకుడిగా మారారు. ఇప్పటికీ ఆయన ఒక్క ఫ్లాప్ సినిమా కూడా ఇవ్వలేదు. చేసిన అన్ని సినిమాలతో హిట్స్ కొడుతూ ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే తాను దర్శకుడిగా మారడానికి తన తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ కి అనిల్ రావిపూడి ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటారు.. 

అవకాశం చిక్కినప్పుడల్లా బహిరంగ వేదికలపై సైతం ఆయన కళ్యాణ్ రామ్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మరో పక్క అనిల్ రావిపూడి తాను బాలకృష్ణ ఫ్యాన్ ని అని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. తాను బాలకృష్ణ కలిసి సినిమా చేయడం తనకు కల అని అనిల్ రావిపూడి చెబుతుంటారు. అయితే ఆయన కల నెరవేరేలా అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయింది. 

ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నందమూరి అభిమానుల కోరిక కూడా తీర్చాలని భావిస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కళ్యాణ్ రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమా సీక్వల్ ఎఫ్ త్రీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. నిజానికి ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిపివేశారు. ఒక్కసారి కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక కళ్యాణ్ రామ్  నందమూరి బాలకృష్ణ సినిమా అవకాశాలు కనిపిస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..!!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>