MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tej12242f6c-7f00-41b8-96da-80483014b4de-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tej12242f6c-7f00-41b8-96da-80483014b4de-415x250-IndiaHerald.jpgవైష్ణవ్ తేజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే చిత్ర సీమలో సంచలనాలు సృష్టించాడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా తన సొంత ప్రతిభతోనే ఇంతటి ఆదరణ పొందాడు. తన తొలి సినిమా ఉప్పెన‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన తొలి సినిమా విడుదల కాకముందే క్రిష్..vaishnav tej;venkatesh;kumaar;nagarjuna akkineni;krish;rakul preet singh;sukumar;kudumu;tollywood;cinema;arjun reddy;tamil;chalo;remake;hero;yuva;vaishnav tej;arjun 1;venky kudumula;reddyఆ హీరో కోసం క్యూ కడుతున్న దర్శకులు..!ఆ హీరో కోసం క్యూ కడుతున్న దర్శకులు..!vaishnav tej;venkatesh;kumaar;nagarjuna akkineni;krish;rakul preet singh;sukumar;kudumu;tollywood;cinema;arjun reddy;tamil;chalo;remake;hero;yuva;vaishnav tej;arjun 1;venky kudumula;reddyTue, 04 May 2021 11:02:38 GMTవైష్ణవ్ తేజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే చిత్ర సీమలో సంచలనాలు సృష్టించాడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా తన సొంత ప్రతిభతోనే ఇంతటి ఆదరణ పొందాడు. తన తొలి సినిమా ఉప్పెన‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన తొలి సినిమా విడుదల కాకముందే క్రిష్ వంటి అగ్ర దర్శకుడి దగ్గర ఛాన్స్ కొట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తన రెండో సినిమాను చేశాడు. ఇందులో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

 ఈ సినిమా చిత్రీకరణ ఉప్పెన విడుదలకు ముందే పూర్తయింది. ఆ తరువాత ఉప్పెన విడుదలయింది. ఇక ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌కి వైష్ణవ్ స్టార్ అయిపోయాడు. దాంతో వైష్ణవ్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. బడా నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా వైష్ణవ్ కోసం క్యూలు కడుతున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమాను అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ దర్శకుడు గిరీశయ్యతో ఇటీవల ప్రారంభించాడు. అంతేకాకుండా వైష్ణవ్ హీరోగా టాలీవుడ్ గ్రీకువీరుడు నాగార్జున కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అందుకోసం ఓ కొత్త దర్శడిని కూడా ఓకే చేసినట్లు సమాచారం.

 వీరే కాకుండా మరింత మంది దర్శకులు కూడా ఈ కుర్ర హీరో కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో సుకుమార్ శిష్యుడు ప్రణవ్ కూడా ఒకడు. ఇదిలా ఉంటే ఈ రేసులో కొత్తగా దర్శకుడు కూడా చేరాడు. ఛలో, భీష్మ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన వెంకీ కుడుముల కూడా వైష్ణవ్ కోసం చూస్తున్నాడంట. భీష్మ తరువాత ఓ స్టార్ హీరోతో తన నెక్ట్స్ సినిమా చేయాలని వెంకీ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో వెంకీ చూపులు వైష్ణవ్ వైపు తిరిగాయి. వెంకీ తన సినిమాకు సంబంధించిన కథను సిద్దం చేసుకొని ఇటీవల వైష్ణవ్‌తో పాటు మెగాస్టార్‌కు వినిపించాడని టాక్ వస్తోంది. మరికొన్ని రోజుల్లో వీరి కాంబోలో సినిమా మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Police or RAW Agent? Confusion over Balayya’s role in his next with Gopichand Malineni!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>