PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpgమినీ మునిసిపాలిటీ ఎన్నికల్లో అనుకున్న‌ట్లుగానే... అంతా ఊహించిన‌ట్లుగానే టీఆర్ ఎస్ పార్టీ అప్ర‌తిహ‌త విజ‌యాల‌ను న‌మోదు చేసింది. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు , సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించి పార్టీకి తిరుగులేదని మరోమాkcr;kcr;tiru;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;khammam;cpi;petta;siddipet;party;mantraసీఎం మాట‌లు నిజ‌మ‌వుతున్నాయిగా... గులాబీకి అప్ప‌టి వ‌ర‌కు తిరుగులేదంట‌..!సీఎం మాట‌లు నిజ‌మ‌వుతున్నాయిగా... గులాబీకి అప్ప‌టి వ‌ర‌కు తిరుగులేదంట‌..!kcr;kcr;tiru;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;khammam;cpi;petta;siddipet;party;mantraTue, 04 May 2021 07:32:28 GMTమినీ మునిసిపాలిటీ ఎన్నికల్లో అనుకున్న‌ట్లుగానే... అంతా ఊహించిన‌ట్లుగానే టీఆర్ ఎస్ పార్టీ అప్ర‌తిహ‌త విజ‌యాల‌ను న‌మోదు చేసింది. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు , సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించి పార్టీకి తిరుగులేదని మరోమారు నిరూపించారని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ  సీఎం ధన్యవాదాలు తెలిపారు.


మ‌రో ద‌శాబ్ద‌కాలం పాటు తెలంగాణ‌లో ఏ రాజ‌కీయ పార్టీకి అధికారం ద‌క్క‌కుండా టీఆర్ ఎస్ పార్టీ కాపాలా కాస్తుంద‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల మంత్రుల‌తో వ్యాఖ్య‌నించారంట‌. త‌ద‌నుగుణంగానే రాజ‌కీయ ల‌క్ష్యాలు చేరుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో కారు దూసుకెళ్లింది. కారు జోరుకు కాంగ్రెస్‌, బీజేపీలు బేజార‌య్యాయి.  గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లు సహా నకిరేకల్‌, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల,‍ కొత్తూరు పురపాలికలను కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ గట్టిపోటీ ఇవ్వగా.. వరంగల్‌ లో బీజేపీ, ఖమ్మంలో కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలిచాయి.


 హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ప్రసిద్ధిగాంచిన గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌పై గులాబీ జెండాను ఎగుర‌వేసింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66డివిజన్లు ఉండ‌గా 48 డివిజన్లలో విజయం సాధించింది.బీజేపీ 10,  కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధించారు. ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్‌ ను టీఆర్ఎస్ మరోసారి నిలబెట్టుకుంది. మొత్తం 60 డివిజన్లలో 46 స్థానాల్లో టీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్-సీపీఎం కూటమి అభ్యర్థులు 11 చోట్ల గెలుపొందారు. బీజేపీ ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు. మొత్తం 60 డివిజన్లకుగాను.. 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం 10వ డివిజన్‌ టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>