PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrfe62647f-52ed-4718-a25a-24cc706e7a1a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrfe62647f-52ed-4718-a25a-24cc706e7a1a-415x250-IndiaHerald.jpgనమస్తే తెలంగాణ పత్రిక.. ఇది కేసీఆర్ సొంత పత్రిక అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పత్రిక ఈటల రాజేందర్ భూ అక్రమాలు అంటూ వరుస కథనాలు రాస్తోంది. మల్కాజ్‌గిరి జిల్లా షామీర్‌పేట్‌ మండలంలోని దేవరయాంజాల్‌లోమాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం భారీ ఎత్తున భూకబ్జాకు పాల్పడినట్లు నమస్తే తెలంగాణ రాసింది. సీతారామా స్వామీ.. నీ భూములు కనపడవేమీ అంటూ రాసుకొచ్చింది. దీనిపై ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దేవరయాంజల్ భూ కబ్జాపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రధాన కార్యదర్శి సోమేkcr;kcr;manya;raghu;revanth;swetha;tiru;eatala rajendar;telangana;revanth reddy;congress;mp;district;mandalam;minister;press;cheque;reddy;etela rajender'నమస్తే తెలంగాణ' పత్రిక గురించి సంచలన ఆరోపణ..?'నమస్తే తెలంగాణ' పత్రిక గురించి సంచలన ఆరోపణ..?kcr;kcr;manya;raghu;revanth;swetha;tiru;eatala rajendar;telangana;revanth reddy;congress;mp;district;mandalam;minister;press;cheque;reddy;etela rajenderTue, 04 May 2021 08:06:27 GMTనమస్తే తెలంగాణ పత్రిక.. ఇది కేసీఆర్ సొంత పత్రిక అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పత్రిక ఈటల రాజేందర్ భూ అక్రమాలు అంటూ వరుస కథనాలు రాస్తోంది. మల్కాజ్‌గిరి జిల్లా షామీర్‌పేట్‌ మండలంలోని దేవరయాంజాల్‌లోమాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం భారీ ఎత్తున భూకబ్జాకు పాల్పడినట్లు నమస్తే తెలంగాణ రాసింది. సీతారామా స్వామీ.. నీ భూములు కనపడవేమీ అంటూ రాసుకొచ్చింది. దీనిపై ఏకంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

దేవరయాంజల్  భూ కబ్జాపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూములపై విచారణకు ఐఏఎస్ అధికారులు రఘునందన్‌ రావు, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, భారతీ, శ్వేతా మహంతితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడి శ్రీ సీతారామ స్వామి దేవాలయానికి 1521.31 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈటల, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించిన భూమి విలువ రూ. 1000 కోట్ల ఉంటుందని నమస్తే తెలంగాణ రాసినట్లు జీవోలో పేర్కొన్నారు.

ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఇలాంటి సంచలన కథనం రాసిన నమస్తే తెలంగాణ కూడా అదే వివాదాస్పద భూముల్లో ప్రింట్ అవుతోందట. దేవర యాంజల్‌లోని వివాదాస్పద భూముల్లోనే నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఉందని.. నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యానికి భూములు ఉన్నాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు.

ఇప్పుడు ఈటల రాజేందర్‌కు చెక్ చెప్పేందుకు బయటకు వచ్చిన ఈ దేవర యాంజల్ భూముల వ్యవహారం ఎన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి. ఇక్కడ మొత్తం 1400 ఎకరాల వరకూ భూములు ఆలయ మాన్యం కింద ఉన్నాయి. వాటిని ఆక్రమించిన పెద్దలెవరు.. ఇంకా ఎవరి పేర్లు బయటకువస్తాయో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>