PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronavirus5689fa7c-4797-4581-a7be-67d9aab16d43-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronavirus5689fa7c-4797-4581-a7be-67d9aab16d43-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజున కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడూ ప్రపంచంలో మనదే గొప్ప దేశం అని చంకలు గుద్దుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రపంచమంతా మన దేశాన్ని ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శిస్తోంది.CORONAVIRUS;manu;nithya new;rahul new;rahul;k l rahul;rahul gandhi;narendra modi;mohandas karamchand gandhi;congress;bari;government;media;prime minister;rahul sipligunj;central government;oxygen;coronavirus;narendra;santoshamమోదీ మిత్రోం .. "మన్ కీ బాత్" కబుర్లేంటి ?మోదీ మిత్రోం .. "మన్ కీ బాత్" కబుర్లేంటి ?CORONAVIRUS;manu;nithya new;rahul new;rahul;k l rahul;rahul gandhi;narendra modi;mohandas karamchand gandhi;congress;bari;government;media;prime minister;rahul sipligunj;central government;oxygen;coronavirus;narendra;santoshamTue, 04 May 2021 13:00:00 GMTప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజున కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడూ ప్రపంచంలో మనదే గొప్ప దేశం అని చంకలు గుద్దుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రపంచమంతా మన దేశాన్ని ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శిస్తోంది. వాస్తవంగా ప్రధాని మోదీని ఎన్నో ఆశలతో ముందు చూపు ఉన్న నాయకుడని బీజేపీని గెలిపించి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయిన ప్రజలంతా ఇప్పుడు బాధపడుతున్నారు. మోదీ వస్తే దేశం బాగుపడుతుంది ..ప్రజలు సంతోషంగా ఉంటారని భావించిన మనకు నిరాశ పడక తప్పడం లేదు. ఈ రోజు కరోనా సెకండ్ వేవ్ మన దేశాన్ని సెకనుకు ఒకరిని చొప్పున మింగేస్తుంటే మన ప్రధాని ఏంచేస్తున్నారు. పూర్తిగా చేతులెత్తేశారు.

గత సంవత్సరం ఇదే విధంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇంత ప్రమాదం లేదు. అయినప్పటికీ వారానికి రెండు మూడు సార్లు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం మరియు వారం వారం మన్ కీ బాత్ అనే కార్యక్రమం ద్వారా కరోనా గురించి జాగ్రత్తలు చెప్పడం, నిత్యం ఏదో ఒక విధంగా ప్రజలతో టచ్ లో ఉంటూ ధైర్యం చెప్పే వారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఇంకా దారుణంగా ఉంది. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మనుషులు కరోనా కాటుకు బలైపోతున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ జాడ లేదు. దీనితో దేశంలోని రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, వార్తాపత్రికలు మరియు మీడియా చానళ్లు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నాయి. ఈ మధ్యనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, "మోదీ గారు...ఇప్పుడెక్కడికి పోయింది మన్ కీ బాత్ ...ఇప్పుడు కావాల్సింది "మన్ కీ బాత్ కాదు జన్ కీ బాత్" అని వ్యాఖ్యలు చేశాడు. దేశంలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్న విమర్శలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి.

కరోనా ఉధృతితో దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పలువురు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఆక్సిజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఢిల్లీకి వచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ల లెక్కలు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలీదు. ఎన్నో ఆక్సిజన్ సిలిండర్ లు సరైన అనుమతులు లేక ఢిల్లీలో మూలనపడి ఉన్నాయి. కనీసం వాటిని ఉపయోగించుకున్నా కొంతమేరకు ఆక్సిజన్ కొరత కొరత తీరే అవకాశముంది. మరి రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోనున్నారో అని తలుచుకుంటేనే చాలా విచారంగా ఉంది. ప్రధాని ఇకనైనా సరైన ప్రణాళికతో త్వరిత చర్యలను చేపట్టి కరోనా బారి నుండి దేశ ప్రజలను కాపాడతారని ఆశిద్దాం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు గుభేల్: రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్..!!

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>