Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb2081594-edf4-46c0-bb90-c034a34c6269-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb2081594-edf4-46c0-bb90-c034a34c6269-415x250-IndiaHerald.jpgఏం చేసినా ‘ఏదో చేశాం’ అనేలా ఉండకూడదు. ‘అబ్బ ఏం చేశార్రా..’ అనేలా ఉండాలి. అందులో మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితో అందరికంటే ముందే ఉంటాడు. అతడి సినిమాలూ అలానే ఉంటాయి. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంటాయి. ఇక గతేడాది బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా..allu arjun;view;anu malik;armaan malik;pooja hegde;adhithya;allu arjun;geetha;ramu;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;ala venkatapuram lo;kanna lakshminarayana;industry;arjun 1;ramajogayya sastry;nijam;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;fidaa;chitram600 మిలియన్ల క్లబ్‌లో ఫస్ట్ టాలివుడ్ సాంగ్.. బన్నీనా మజాకా..!600 మిలియన్ల క్లబ్‌లో ఫస్ట్ టాలివుడ్ సాంగ్.. బన్నీనా మజాకా..!allu arjun;view;anu malik;armaan malik;pooja hegde;adhithya;allu arjun;geetha;ramu;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;ala venkatapuram lo;kanna lakshminarayana;industry;arjun 1;ramajogayya sastry;nijam;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;fidaa;chitramTue, 04 May 2021 13:24:29 GMTఇంటర్నెట్ డెస్క్: ఏం చేసినా ‘ఏదో చేశాం’ అనేలా ఉండకూడదు. ‘అబ్బ ఏం చేశార్రా..’ అనేలా ఉండాలి. అందులో మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితో అందరికంటే ముందే ఉంటాడు. అతడి సినిమాలూ అలానే ఉంటాయి. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంటాయి. ఇక గతేడాది బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా అదే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆ సినిమాలోని ఓ సాంగ్ ఇప్పుడు టాలీవుడ్లోనే తొలిసారిగా 600 మిలియన్ల క్లబ్‌లో చేరి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటకీ శ్రోతలను ఊరిస్తూనే ఉంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని విడుదలకాగానే సెన్షేషన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్స్ ఇప్పటికీ రికార్డులు కొల్లగొడుతున్నాయంటే ఇక ఆ మ్యూజిక్‌లోని మ్యాజిక్ ఎలాంటిదో అర్థం చేసుకోండి. ముఖ్యంగా 'సామజవరగమనా' 'రాములో రాములా' 'బుట్టబొమ్మ' సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ దక్కించుకున్నాయి. ఈ మూడింటిలోనూ 'బుట్టబొమ్మ' పాటకు ఫిదా కాని ప్రేక్షకుడున్నడంటే అది అబద్ధమే అవుతుంది.  అందుకే ఈ సాంగ్ తాజాగా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది.

'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్‌లో 600 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. దాంతో పాటు దాదాపు 40 మిలియన్ లైక్స్ కూడా రాబట్టింది. దీంతో ఈ సాంగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 'ఇంత కన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో..' అంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అందించిన మధురమైన లిరిక్స్.. సింగర్ అర్మాన్ మాలిక్ గొంతులో ఆ భావాలు సరిగ్గా పలికించడంతో శ్రోతలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఇక బన్నీ డ్యాన్స్ గురించి ఎంత ఎక్కువగా చెప్పినా తక్కువే అవుతుంది. పాటకు, బీట్‌కు ఏ మాత్రం మిస్ కాకుండా స్టైలిష్‌గా అతడు వేసిన స్టెప్స్ చూపరులను కట్టిపడేస్తాయి. దీనికి తోడు పూజా హెగ్దే ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఏదేమైనా జనాల హృదయాలను కొల్లగొట్టిన ఈ 'బుట్టబొమ్మ' సాంగ్ తెలుగు పాటే అయినప్పటికీ.. ఇతర ప్రాంతాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేయడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.అందుకే ‘ఈ పాట సార్ పాటంతే’.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు గుభేల్: రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్..!!

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>