SmaranaSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/dasari-narayana-raoc69691bd-9131-4727-924a-447dfb8b5e6c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/dasari-narayana-raoc69691bd-9131-4727-924a-447dfb8b5e6c-415x250-IndiaHerald.jpgచలనచిత్ర రంగంలో సుమారు 151 సినిమాలకు దర్శకత్వం వహించి అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు నటుడిగా కూడా అద్భుతాలు సృష్టించారు. రచయితగా, గీత రచయితగా కూడా సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న దాసరి నారాయణరావు మే 4, 1942న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 6వ తరగతి చదువుతున్న రోజుల్లో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం తో నెలకి రూపాయి జీతానికి పని చేశారు. తన తరగతిలో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నప్పటికీ ఆర్థిక సమdasari narayana rao;jayanthi;dasari narayana rao;geetha;raghu;ramu;hyderabad;godavari river;district;cinema;telugu;director;husband;konakalla narayana rao;venkaiah naidu;jayamహెరాల్డ్ స్మరామీ: దర్శకులలో ఆణిముత్యం దాసరి నారాయణ రావు..హెరాల్డ్ స్మరామీ: దర్శకులలో ఆణిముత్యం దాసరి నారాయణ రావు..dasari narayana rao;jayanthi;dasari narayana rao;geetha;raghu;ramu;hyderabad;godavari river;district;cinema;telugu;director;husband;konakalla narayana rao;venkaiah naidu;jayamTue, 04 May 2021 06:30:00 GMTడైరెక్టర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు నటుడిగా కూడా అద్భుతాలు సృష్టించారు. రచయితగా, గీత రచయితగా కూడా సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న దాసరి నారాయణరావు మే 4, 1942న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 6వ తరగతి చదువుతున్న రోజుల్లో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం తో నెలకి రూపాయి జీతానికి పని చేశారు. తన తరగతిలో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఆయన చదువు మానేసి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ఒక టీచర్ దాసరి నారాయణరావుని తన సొంత డబ్బుతో చదివించారు. ఆ విధంగా దాసరి నారాయణ బిఎ చేశారు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటించేవారు. అయితే అతి తక్కువ కాలంలోనే రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు వంటి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ సృష్టించారు. ఈ సినిమాలు చాలా పురస్కారాలు తెచ్చిపెట్టాయి.

మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా సినిమాల్లో దాసరి నారాయణరావు అద్భుతంగా నటించి తనలోని ఒక గొప్ప నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దాసరి నారాయణరావుకు 3 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా 9 రాష్ట్ర నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. 1990 కాలంలో దాసరి నారాయణరావు తెలుగుతల్లి అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తర్వాత కాలంలో ఆయన బొగ్గు, గనుల శాఖకు కేంద్రమంత్రి ఎన్నికయ్యారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 2017 మే 30న మరణించారు. సినిమా రంగానికి చేసిన సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందాం.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా..?

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>