MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari8ab5a9ab-abd6-4852-a75f-935c7a693c8f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari8ab5a9ab-abd6-4852-a75f-935c7a693c8f-415x250-IndiaHerald.jpgదాసరి నారాయణరావు చిన్నప్పటి నుంచి కళ పట్ల మక్కువ పెంచుకున్న వ్యక్తి. ఆయన ఏడవ తరగతి చదువుతున్నపుడే నాటక పోటీలలో విజేతగా నిలిచారు. దాసరి ఆ రోజుల్లోనే స్వయంగా నాటకం రాసుకుని డైరెక్ట్ చేయడం తానే పాత్ర పోషించడం వంటి బహుముఖీయమైన ప్రతిభను కనబరచారు. dasari;ntr;manu;savitri;tara;hyderabad;komaram bheem;cinema;job;director;chennai;hero;mahanati;savithri 1దాసరి డైరెక్ట్ చేసిన ఫస్ట్ హీరో ఆయనే .... ?దాసరి డైరెక్ట్ చేసిన ఫస్ట్ హీరో ఆయనే .... ?dasari;ntr;manu;savitri;tara;hyderabad;komaram bheem;cinema;job;director;chennai;hero;mahanati;savithri 1Tue, 04 May 2021 11:00:00 GMTదాసరి నారాయణరావు చిన్నప్పటి నుంచి కళ పట్ల మక్కువ పెంచుకున్న వ్యక్తి. ఆయన ఏడవ తరగతి చదువుతున్నపుడే నాటక పోటీలలో విజేతగా నిలిచారు. దాసరి ఆ రోజుల్లోనే స్వయంగా నాటకం రాసుకుని డైరెక్ట్ చేయడం తానే పాత్ర పోషించడం వంటి బహుముఖీయమైన ప్రతిభను కనబరచారు.

ఆయనకు సినిమాల్లోకి  వెళ్లాలని కోరిక బలంగా ఉంది.  హైదరాబాద్ లో ఆయన బతుకు తెరువు కోసం జాబ్ చేస్తూ మద్రాస్ లో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అలా అందం కోసం పందెం మూవీలో మంచి చాన్స్ ఉందని రమ్మంటే మద్రాస్ వెళ్లారు. తీరా వెళ్లాక అసలు వేషం పోయింది. దాంతో వెనక్కి తిరిగి రాలేక అక్కడే ఉంటూ డైరెక్షన్ డిపార్టుమెంట్ లో మెల్లగా దాసరి  కుదురుకున్నారు.

ఆయన చాలా మంది ప్రముఖుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన సినిమాలకు కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే నాటి ప్రముఖ నటుడు నాగభూషణం ఎన్టీయార్ హీరోగా తీసిన ఒకే కుటుంబం మూవీకి భీమ్ సింగ్ డైరెక్టర్. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా దాసరి ఉన్నారు.

ఇక ఆ సినిమా మధ్యలో భీమ్ సింగ్ కి ఏదో పని ఉండి షూటింగ్ కి రాలేకపోయారు. అపుడు ఆ సినిమా కొంత మొత్తం తీసే బాధ్యతను దాసరికి అప్పగించారు. అలా దాసరి తొలి సారిగా ఎన్టీయార్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీయార్ నాడే దాసరి ప్రతిభను చూసి ఎప్పటికైనా టాప్ డైరెక్టర్ అవుతారు అని దీవించారుట. మొత్తానికి అదే నిజమై మరో ఏడెనిమిది సంవత్స‌రాల తరువాత ఎన్టీయార్ తో దాసరి మనుషులంతా ఒక్కటే మూవీని తీసి సూపర్ హిట్ చేశారు. ఈ ఇద్దరి కలయికలో మొత్తం అయిదు సినిమాలు వచ్చాయి. మొత్తంగా  చూస్తే ఎన్టీయార్ దాసరి తొలి హీరో అనాల్సిందే.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారెవ్వా.. వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డ్..!!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>