EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/coronavirusd5abb5b7-da69-448b-8bca-15a058b93580-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/coronavirusd5abb5b7-da69-448b-8bca-15a058b93580-415x250-IndiaHerald.jpgకరోనా మొదటి వేవ్ ఇండియాలో ఎంత కల్లోలం సృష్టించిందో తెలుసు... అయితే మొదటి వేవ్‌లో ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే ఇండియా బెటర్. అయితే సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఆ నిపుణుల హెచ్చరికలను కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ వ్యవస్థలను మెరుగు పరిచి.. ముందుగా అందరికీ వ్యాక్సీన్ ఇవ్వడంపై దృష్టి సారించి ఉంటే.. సెకండ్ వేవ్ ఫలితాలు ఇంత దారుణంగా ఉండేవి కావు. ఇప్పుడు ఇండియాలో రోజూ 3 నుంచి 4 వేల మంది కరోనాతో చనిపోతున్నారుcoronavirus;india;january;september;central government;oxygenషాకింగ్ : కరోనా సెకండ్‌ వేవ్‌కు ముందు.. అలా ఎందుకు చేశారు..?షాకింగ్ : కరోనా సెకండ్‌ వేవ్‌కు ముందు.. అలా ఎందుకు చేశారు..?coronavirus;india;january;september;central government;oxygenTue, 04 May 2021 10:00:00 GMTకరోనా మొదటి వేవ్ ఇండియాలో ఎంత కల్లోలం సృష్టించిందో తెలుసు... అయితే మొదటి వేవ్‌లో ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే ఇండియా బెటర్. అయితే సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఆ నిపుణుల హెచ్చరికలను  కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ వ్యవస్థలను మెరుగు పరిచి.. ముందుగా అందరికీ వ్యాక్సీన్ ఇవ్వడంపై దృష్టి సారించి ఉంటే.. సెకండ్ వేవ్ ఫలితాలు ఇంత దారుణంగా ఉండేవి కావు.

ఇప్పుడు ఇండియాలో రోజూ 3 నుంచి 4 వేల మంది కరోనాతో చనిపోతున్నారు. ఇది కూడా అధికారికంగా చెబుతున్న లెక్కలు మాత్రమే. వాస్తవాలు.. ఇందుకు కొన్ని రెట్లు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కరోనా పరీక్షా కేంద్రాల వద్ద క్యూలు, టీకాల వద్ద క్యూలు,  ఆసుపత్రుల ముందు క్యూలు.. చివరకు శ్మశానాల వద్ద క్యూలు.. దేశం ఓ పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో ఓ భయంకరమైన వాస్తవం వెలుగు చూసింది.

అదేంటంటే.. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ముందు.. దేశంలోని ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్ల సంఖ్యను సుమారు 40 శాతం వరకూ తగ్గించడం.. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కరోనా మృత్యు విలయానికి అదే కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కలే ఈ నిర్లక్ష్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ లెక్కలు ఏం చెబుతున్నాయంటే.. కరోనా ఫస్ట్ వేవ్ బలంగా ఉన్న గత ఏడాది సెప్టెంబర్ సమయంలో ఇండియాలో  రెండున్నర లక్షల ఆక్సిజస్ సపోర్ట్ బెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత జనవరి నాటికి వాటి సంఖ్య సుమారు లక్షన్నరకు పడిపోయింది. అంటే.. దాదాపు 36 శాతం ఆక్సిజన్ బెడ్లను తగ్గించారన్నమాట.

ఐసీయూ బెడ్లు కూడా గత సెప్టెంబర్‌లో 66 వేలకుపైగా ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉంటే.. జనవరి నాటికి అవి 36 వేలకు పడిపోయాయి. అంటే దాదాపు సగానికి సగం తగ్గించేశారు. సాధారణంగా కరోనా ముప్పు తొలగక ముందు ఎవరైనా సౌకర్యాలు పెంచుకుంటారు. కానీ మన ప్రభుత్వాలు సౌకర్యాలు తగ్గించడం వల్ల.. ఆ తర్వాత సెకండ్ వేవ్ విరుచుకుపడే నాటికి ఒక్కసారిగా పడకల కొరత వచ్చి.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ళు దాటిన వాళ్లకు నేడు జగనన్న గుడ్ న్యూస్...?

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>