PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vaccine5ca7cd39-99f0-47f4-9835-3168587e7766-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vaccine5ca7cd39-99f0-47f4-9835-3168587e7766-415x250-IndiaHerald.jpgక‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఇస్తున్న టీకాను తీసుకోవాలంటే ఇక నుంచి రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా చేయించుకోవాల్సిందే. కొవిన్ పోర్ట‌ల్‌లోకి వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాల‌ని, ఆ త‌రువాత‌నే వారికి కొవిడ్ టీకా ఇస్తామ‌ని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ప‌లువురు ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. కొవిడ్ పోర్ట‌ల్ లోకి వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలంటే కేవ‌లం చ‌దువుకున్న‌వారికే సాధ్య‌మ‌వుతుంద‌ని, మ‌రి గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల సంగ‌తేంట‌నcovid vaccineటీకాకోసం పాట్లు.. రిజిస్ట్రేష‌న్ మ‌స్ట్!టీకాకోసం పాట్లు.. రిజిస్ట్రేష‌న్ మ‌స్ట్!covid vaccineTue, 04 May 2021 08:31:53 GMTతెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతుంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డిచేసేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. ముఖ్యంగా వ్యాక్సినేష‌న్‌ను ఉధృతం చేసింది. 45యేళ్లు నిండిన ప్ర‌తీఒక్కరికి టీకాను వేస్తున్నారు. ప్ర‌తీఒక్క‌రూ టీకా వేయించుకోవాల‌ని అధికారులు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ప్ర‌భుత్వ ద‌వాఖానాలు, ప‌లు ప్రైవేట్ ద‌వాఖానాల్లో ఈ టీకాను ఇస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కేంద్రానికి వెళ్లిన ప్ర‌తీఒక్క‌రికి టీకా వేసేవారు అధికారులు. కానీ ప్ర‌స్తుతం కొత్త రూల్స్ పెట్టారు. రిజిస్ట్రేష‌న్ ఉంటేనే టీకా వేస్తామ‌ని తేల్చిచెబుతున్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఇస్తున్న టీకాను తీసుకోవాలంటే ఇక నుంచి రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా చేయించుకోవాల్సిందే. కొవిన్ పోర్ట‌ల్‌లోకి వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాల‌ని, ఆ త‌రువాత‌నే వారికి కొవిడ్ టీకా ఇస్తామ‌ని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ప‌లువురు ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. కొవిడ్ పోర్ట‌ల్ లోకి వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలంటే కేవ‌లం చ‌దువుకున్న‌వారికే సాధ్య‌మ‌వుతుంద‌ని, మ‌రి గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల సంగ‌తేంట‌ని ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లు టీకా అంటేనే కొంత భ‌యానికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీకా తీసుకోవాలంటే రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని కొత్త నిబంధ‌న పెడితే గ్రామాల్లోని పేద ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌తార‌ని, వారికి టీకా అందే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ప‌లువురు ప్ర‌భుత్వానికి సూచిస్తున్నారు.

సెకండ్ వేవ్ తీవ్ర‌త‌తో వ్యాక్సిన్ల కోసం ప్ర‌జ‌లు బారులు తీర‌డంతో ప్ర‌స్తుతం టీకాల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఇక రెండో డోసుకు కూడా స్లాట్ బుకింగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. ఎక్కువ మంది తొలిడోస్ వారే బుక్ చేసుకుంటే రెండో డోసువారి ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే సోమ‌వారం రాష్ట్రానికి 4ల‌క్ష‌ల టీకా డోస్‌లు వ‌చ్చాయి. టీకా నిల్వ‌లు త‌గినంత లేక‌పోవ‌డంతో శ‌ని, ఆదివారం వ్యాక్సినేష‌న్ నిలిపివేశారు. తాజాగా వ‌చ్చిన టీకా డోసుల‌ను వెంట‌నే జిల్లాల‌కు పంపారు. కొవిన్ సాప్ట్ వేర్‌లో బుక్ చేసుకున్న స్లాట్స్ ఆధారంగా టీకాలిస్తారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>