PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaelectionresult30e3ba02-dbee-43cb-9d53-2edcaedf4b52-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaelectionresult30e3ba02-dbee-43cb-9d53-2edcaedf4b52-415x250-IndiaHerald.jpgఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో టీఆర్ఎస్‌, సీపీఐ క‌లిసి బ‌రిలోకి దిగాయి. 60 డివిజ‌న్‌ల‌లో 57 డివిజ‌న్‌ల‌లో తెరాస అభ్య‌ర్థులు, మూడు డివిజ‌న్‌ల‌లో సీపీఐ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ 45 నుంచి 50 డివిజ‌న్‌ల‌లో గెలుస్తామ‌ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల వ‌ద్ద మాట ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఖ‌చ్చితంగా కార్పొరేష‌న్‌పై తెరాస జెండా ఎగురుతుంద‌ని, భారీ మెజార్టీతో తిరిగి మీ వ‌ద్ద‌కు వ‌స్తాన‌ని కేటీఆర్‌కు పువ్వాడ అజ‌య్ తెలిపిన‌ట్లు స‌మాచారం.telanganaelectionresult;kumaar;tiru;telangana rashtra samithi trs;car;minister;cpi;partyకారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|కారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|telanganaelectionresult;kumaar;tiru;telangana rashtra samithi trs;car;minister;cpi;partyTue, 04 May 2021 09:09:27 GMTరాష్ట్ర వ్యాప్తంగా రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అన్ని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో అధికార తెరాస పార్టీ మేయ‌ర్‌, చైర్మ‌న్ పీఠాల‌ను ద‌క్కించుకుంది. ముఖ్యంగా వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ల‌ను అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో పోటాపోటీ ప్ర‌చారం సాగించాయి. ఆయా పార్టీల‌కు చెందిన అగ్ర‌నేత‌లు ప్ర‌చార‌బ‌రిలో పాల్గొని అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. ముఖ్యంగా ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో పువ్వాడ అజ‌య్ కుమార్ అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకున్నారు. డివిజ‌న్‌లోని ప్ర‌తీ గ‌ల్లీ తిరుగుతూ తెరాస అభ్య‌ర్థుల గెలుపుకోసం కృషిచేశారు.

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో టీఆర్ఎస్‌, సీపీఐ క‌లిసి బ‌రిలోకి దిగాయి. 60 డివిజ‌న్‌ల‌లో 57 డివిజ‌న్‌ల‌లో తెరాస అభ్య‌ర్థులు, మూడు డివిజ‌న్‌ల‌లో సీపీఐ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ 45 నుంచి 50 డివిజ‌న్‌ల‌లో గెలుస్తామ‌ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల వ‌ద్ద మాట ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఖ‌చ్చితంగా కార్పొరేష‌న్‌పై తెరాస జెండా ఎగురుతుంద‌ని, భారీ మెజార్టీతో తిరిగి మీ వ‌ద్ద‌కు వ‌స్తాన‌ని కేటీఆర్‌కు పువ్వాడ అజ‌య్ తెలిపిన‌ట్లు స‌మాచారం. దీంతో కేటీఆర్‌కు హామీ ఇచ్చిన‌ట్లుగానే 45 డివిజ‌న్‌ల‌లో తెరాస మ‌ద్ద‌తు దారులు గెలుపొందారు. ఎన్నిక‌ల ముందు పాత‌బ‌స్టాండ్‌, కొత్త బ‌స్టాండ్ వివాదం తెరాస‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఈ క్ర‌మంలో  పాత బ‌స్టాండ్ ప్రాంత‌మైన మామిళ్ల‌గూడెం, మ‌యూరి సెంట‌ర్‌, వైరా రోడ్డు, త‌దిత‌ర ప్రాంతాల్లోని డివిజ‌న్‌ల‌లో ప్ర‌జ‌లు తెరాస‌కు వ్య‌తిరేకంగా ఓట్లు వేస్తార‌ని భావించారు. కానీ పాత‌బ‌స్టాండ్ ప్రాంత ప్ర‌జ‌లుసైతం తెరాస అభ్య‌ర్థుల‌నే గెలిపించ‌డం గ‌మ‌నార్హం.

గ‌త 2016లో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల బ‌రిలోకి తెరాస దిగింది. అప్పుడుసైతం మంత్రి తుమ్మ‌ల‌నే అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను తీసుకున్నారు. 34 డివిజ‌న్ల‌లో తెరాస అభ్య‌ర్థులు గెలిపి మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకున్నారు. ప్ర‌స్తుతం పువ్వాడ అజ‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో 45 మంది తెరాస మ‌ద్ద‌తు దారులు గెలిచి మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నారు. అయితే మేయ‌ర్ స్థానం జ‌న‌ర‌ల్‌కు రిజ‌ర్వేష‌న్ కావ‌డంతో ప‌లువురు పోటీ ప‌డుతున్నారు. దీంతో పువ్వాడ అజ‌య్ మేయ‌ర్ అభ్య‌ర్థిని బీసీకి ఇస్తారా? ఓసీ అభ్య‌ర్థికి కేటాయిస్తారా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకు అండగా సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>