MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf249aed2fe-6c61-4944-a1b5-6e49ae04367e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf249aed2fe-6c61-4944-a1b5-6e49ae04367e-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్ ఈ సినిమా తెలియని వారుండరు. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం విడుదలైన కేజీఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రభంజనాలు సృష్టించింది. ఓ కన్నడ సినిమా ఆ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అప్పటి వరకూ ఎవ్వరూ ఉహించిఉండరు. అందులోనూ ఈ సినిమా విడుదలైన ప్రతి భాషలోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అంతగా అంచనాలు లేకుండా విడుదలైన..kgf2;prasanth;prashanth neel;india;cinema;bahubali;tamil;kannada;kgf;prasanth neel;indian;lie;prashant kishorయుద్దానికి సిద్దమవుతున్న రాకీభాయ్.. తగ్గేదే లేదు..యుద్దానికి సిద్దమవుతున్న రాకీభాయ్.. తగ్గేదే లేదు..kgf2;prasanth;prashanth neel;india;cinema;bahubali;tamil;kannada;kgf;prasanth neel;indian;lie;prashant kishorTue, 04 May 2021 21:21:31 GMTకేజీఎఫ్ ఈ సినిమా తెలియని వారుండరు. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం విడుదలైన కేజీఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రభంజనాలు సృష్టించింది. ఓ కన్నడ సినిమా ఆ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అప్పటి వరకూ ఎవ్వరూ ఉహించిఉండరు. అందులోనూ ఈ సినిమా విడుదలైన ప్రతి భాషలోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అంతగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తన రిజల్ట్‌తో అందరినీ అవాక్కు చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్లు కూడా రోజురోజుకూ భారీగా పెరిగాయి. ఈ ఒక్క సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

అంతేకాకుండా బాహుబలి సినిమా రెండో భాగం కోసం దేశంలోని సీనీప్రేమికులందరూ ఎంతలా ఎదురుచూశారో అందరికీ తెలిసిన విషయమే. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం కూడా అదే స్థాయిలో అందరూ వేచి చూస్తున్నారు. ఈ సినిమా రెండో చాప్టర్ ఉందని ప్రకటించగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకుల్లో ఉన్న ఉత్కంఠ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ సినిమా నిజానికి గతేడాది దసరాకే విడుదల కావాల్సింది. కానీ కరోనా దెబ్బకు ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఏడాది జులై 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తూనే కేజీఎఫ్2 పనులు కూడా చక్కబెడుతున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపుగా పూర్తయిందట. మరికొన్ని రోజుల్లోనే ఫస్ట్ కాపీ కూడా పూర్తవుతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా నిడివి ప్రస్తుతం వస్తున్న సినిమాలతో పోలిస్తే కాస్త ఎక్కువనే చెప్పాలి. కేజీఎప్2 సినిమా దాదాపు 2 గంటల 52 నిమిషాల నిడివితో ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండో భాగం చిత్రీకరణలో దాదాపు సగం వరకు మొదటి భాగం విడుదలకు ముందే పూర్తయింది.

 ఆ తరువాత మిగతా సగం ముగించారు. సినిమాను మొదట ఎడిట్ చేసినప్పుడు 3 గంటలు వచ్చిందని, వీడియో అంతా అద్భుతంగా ఉండటంతో ఏ సన్నివేశాన్ని తొలగించాలో అర్థంకాలేదని చిత్ర యూనిట్ అన్నట్లు సమాచారం. ఇక సినిమాకి ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే నిడివి కాస్త ఎక్కువైనా ప్రేక్షకులు ఆదరిస్తారని దర్శకుడు అన్నాడంట. ఈ వార్తలను బట్టి చూస్తే జులై16 ప్రేక్షకులకు పండగనే చెప్పాలి. దాదాపు 3గంటల పాటు కేజీఎఫ్ లోకంలో తేలిపోయేందుకు అభిమానులు సిద్దంగా ఉండాలి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాన్ కొడుకా..? రా ఏజెంటా..?.. ఆ సినిమాలో మహేశ్ ఎవరు..?

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>