MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudy-0608ec73-26a3-46ee-bedd-4a094f6a8b6c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudy-0608ec73-26a3-46ee-bedd-4a094f6a8b6c-415x250-IndiaHerald.jpgరాజమౌళి కొరటాల శివ తరువాత పరాజయం అన్నపదం ఎరుగకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఏకైక డైరెక్టర్ అనీల్ రావిపూడి. ప్రస్తుతం ఈ దర్శకుడు పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇతడితో మహేష్ బాలకృష్ణ రవితేజా లు వ్యవహరిస్తున్న తీరు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం అనీల్ రావిపూడి తీస్తున్న ‘ఎఫ్ 3’ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయింది. దీనితో మరో టాప్ హీరోతో సినిమా చేయాలని అనీల్ రావిపూడి ఈ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో కూడ తన ప్రయత్నాలు వేగంగానే కొనసాగిస్తున్నాడు.వాanil ravipudy;;mahesh;ravi;balakrishna;shiva;anil ravipudi;koratala siva;raja;rajamouli;trivikram srinivas;cinema;director;lord siva;u turn;darsakudu;raja the greatఅనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !anil ravipudy;;mahesh;ravi;balakrishna;shiva;anil ravipudi;koratala siva;raja;rajamouli;trivikram srinivas;cinema;director;lord siva;u turn;darsakudu;raja the greatMon, 03 May 2021 10:00:00 GMTరాజమౌళి కొరటాల శివ తరువాత పరాజయం అన్నపదం ఎరుగకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఏకైక డైరెక్టర్ అనీల్ రావిపూడి. ప్రస్తుతం ఈ దర్శకుడు పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇతడితో మహేష్ బాలకృష్ణ రవితేజా లు వ్యవహరిస్తున్న తీరు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం అనీల్ రావిపూడి తీస్తున్న ‘ఎఫ్ 3’ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయింది. దీనితో మరో టాప్ హీరోతో సినిమా చేయాలని అనీల్ రావిపూడి ఈ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో కూడ తన ప్రయత్నాలు వేగంగానే కొనసాగిస్తున్నాడు.


వాస్తవానికి మహేష్ అనీల్ రావిపూడి తో మరొక సినిమా చేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ తో చేయబోయే మూవీ తరువాత తన మూవీ ఉంటుందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు అని అంటారు. దీనితో అనీల్ రావిపూడి యూటర్న్ తీసుకుని బాలకృష్ణ వైపు వెళితే అతడు అనీల్ తో సినిమా చేయడానికి ఆశక్తి కనపరుస్తూనే ఇప్పటికే తాను కమిట్ అయిన గోపీ చంద్ మలినేని మూవీ పూర్తి అయిన తరువాత తాను అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ వైపు వస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో రవితేజా తో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ తీయాలని లేటెస్ట్ గా అనీల్ రాయబారాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే రవితేజా మాత్రం తాను ఇప్పటికే లైన్ లో పెట్టిన మూడు సినిమాలు పూర్తి అయ్యే వరకు అనీల్ ను ఎదురు చూడమని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ‘ఎఫ్ 3’ పూర్తి అయ్యాక తాను ఏ హీరోతో చేయాలో ఫైనల్ కాకుండా స్క్రిప్ట్ తయారు చేసి ప్రయోజనం ఏమిటి అని అంతర్మధనంలో అనీల్ రావిపూడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో టాప్ హీరోలు అంతా ఈ క్రేజీ దర్శకుడుతో నటించే ఆశక్తి కనపరుస్తున్నా ప్రస్తుతానికి ఎవర్నీ ఫైనల్ చేసుకోలేని కన్ఫ్యూజ్ లో ఈ దర్శకుడు ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>