PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendera4d1c249-8fbf-4302-a776-5b54b17c0992-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendera4d1c249-8fbf-4302-a776-5b54b17c0992-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో స్థానికంగా త‌మ‌కేమైనా ఇబ్బందులు ఎదుర‌వుతాయా అన్న ఆందోళ‌నలో ప‌లువురు ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల బీసీ(ముదిరాజ్‌) సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. దీనికితోడు మొద‌టి నుంచి ఈట‌ల తెరాస‌లో కేసీఆర్‌కు ద‌గ్గ‌ర వ్య‌క్తిగా ఉండ‌టం, అన్ని జిల్లాల్లో ఆయ‌న‌కు కొద్దోగొప్పో ప్ర‌జాబ‌లం ఉంది. ఇప్ప‌టికే ఈట‌ల‌కు అన్యాయం జ‌రిగిందంటూ జిల్లాల వారీగా బీసీ సంఘాలు, ముదిరాజ్ సంఘాల ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేస్తున్నారు. etela rajender;view;kcr;telangana rashtra samithi trs;mudiraj;backward classes;media;minister;local language;party;mantraఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!etela rajender;view;kcr;telangana rashtra samithi trs;mudiraj;backward classes;media;minister;local language;party;mantraMon, 03 May 2021 10:17:28 GMTతెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో ఎవ‌రికీ అంతుచిక్క‌ని ప‌రిస్థితి. పాల‌న ప‌రంగా ప్ర‌జ‌ల్లో కొంత సంతృప్తి ఉన్నా.. పార్టీ వ్య‌వ‌హారాల్లో కేసీఆర్ తీసుకొనే నిర్ణ‌యాలు సొంత పార్టీ నేత‌ల‌ను కంగారెత్తిస్తున్నాయి. గ‌త నాలుగు రోజులుగా ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌ను చూస్తున్న తెరాస నేత‌లు.. సీఎం కేసీఆర్ వ్యూహాలు అర్థంకాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఉన్న‌ట్లుండి ఒక్క‌సారే తెర‌పైకి భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డం, ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వినుండి భ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం అంతా చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కొద్దిమందికి త‌ప్ప పార్టీలోని ప‌లువురు మంత్రులు, ముఖ్య‌నేత‌ల‌కుసైతం అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో ఈట‌ల ఎపిసోడ్‌పై మాట్లాడేందుకుసైతం ఆ పార్టీ నేత‌లు ముందుకు రావ‌డం లేదు.

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో స్థానికంగా త‌మ‌కేమైనా ఇబ్బందులు ఎదుర‌వుతాయా అన్న ఆందోళ‌నలో ప‌లువురు ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల బీసీ(ముదిరాజ్‌) సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. దీనికితోడు మొద‌టి నుంచి ఈట‌ల తెరాస‌లో కేసీఆర్‌కు ద‌గ్గ‌ర వ్య‌క్తిగా ఉండ‌టం, అన్ని జిల్లాల్లో ఆయ‌న‌కు కొద్దోగొప్పో ప్ర‌జాబ‌లం ఉంది. ఇప్ప‌టికే ఈట‌ల‌కు అన్యాయం జ‌రిగిందంటూ జిల్లాల వారీగా బీసీ సంఘాలు, ముదిరాజ్ సంఘాల ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేస్తున్నారు. ఈట‌ల‌ను వెంట‌నే క్యాబినెట్‌లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈట‌ల‌ను కావాల‌నే సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తున్నాడ‌ని, అందులో భాగంగానే పార్టీ నుంచి బ‌హిష్క‌రించేలా వ్యూహాత్మ‌కంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై తెరాస ఎమ్మెల్యేలు, ముఖ్య‌నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల‌ను ఉన్న‌ట్లుండి అవ‌మానప‌ర్చే రీతిలో మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం భావ్యం కాద‌న్న భావ‌నవారిలో వ్య‌క్త‌మ‌వుతుంద‌ట‌. ఒక‌వేళ ఈట‌ల త‌ప్పుచేసి ఉంటే  సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడితే బాగుండేద‌ని, కానీ ఊహించ‌ని రీతిలో ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల పార్టీకి న‌ష్టం చేకూరే అవ‌కాశాలున్నాయ‌ని ఒక‌రికొక‌రు చ‌ర్చించుకుంటున్నార‌ట‌. అలాఅని బ‌య‌ట‌కు వ‌చ్చి ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేని ప‌రిస్థితి. దీంతో కొంద‌రు ముఖ్య‌నేత‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయిన‌ట్లు స‌మాచారం. బ‌య‌ట‌కు వ‌స్తే మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌బోయి అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేస్తే మ‌న‌సీటుకే ఎస‌రొస్తుంద‌న్న భావ‌న కొంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కిం కర్తవ్యం... ?

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>