Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pellu0670e967-6bae-44eb-9f03-03718d4846c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pellu0670e967-6bae-44eb-9f03-03718d4846c7-415x250-IndiaHerald.jpgపెద్దలు కుదిర్చిన వివాహం ఓ అబద్దం చెప్పడం వల్ల ఆగిపోయింది. వరుడు చదవలేదనే విషయం బయటపడటంతో వధువే పెళ్లిని ఆపేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వధువు మహోబా జిల్లాలోని ధావార్ గ్రామానికి చెందినది. పెళ్లిపందిరిలో వధువు పీటలపై కూర్చొని ఉన్నప్పుడు పంతులు చదివే మంత్రాలపై వరుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే వధువు దీనిని తిరస్కరించింది. వరుడు ఈ మంత్రాలు, లెక్కలూ మనకు అర్థం కావు అన్నట్లుగా చెప్పాడు. దీంతో పెళ్లి కూతురు ఆగ్రహం చెందింది. "చిన్న చిన్న లెక్కలు వచ్చు కదా" అంటే వరుడు సైలెంటుగా ఉనPellu;police;marriage;uttar pradesh;murder.;mahobaరెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి బంద్..?రెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి బంద్..?Pellu;police;marriage;uttar pradesh;murder.;mahobaMon, 03 May 2021 14:00:00 GMTపెద్దలు కుదిర్చిన వివాహం ఓ అబద్దం చెప్పడం వల్ల ఆగిపోయింది. వరుడు చదవలేదనే విషయం బయటపడటంతో వధువే పెళ్లిని ఆపేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వధువు మహోబా జిల్లాలోని ధావార్ గ్రామానికి చెందినది. పెళ్లిపందిరిలో వధువు పీటలపై కూర్చొని ఉన్నప్పుడు పంతులు చదివే మంత్రాలపై వరుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే వధువు దీనిని తిరస్కరించింది. వరుడు ఈ మంత్రాలు, లెక్కలూ మనకు అర్థం కావు అన్నట్లుగా చెప్పాడు. దీంతో పెళ్లి కూతురు ఆగ్రహం చెందింది. "చిన్న చిన్న లెక్కలు వచ్చు కదా" అంటే వరుడు సైలెంటుగా ఉన్నాడు. "అసలు మీరు ఏం చదువుకున్నారు..జస్ట్ రెండో ఎక్కం చెప్పండి" అంది. వరుడు ఆమె వైపుచూసి "ఏయ్ సిల్లీగా రెండో ఎక్కం చెప్పడమేంటి" అని నవ్వి ఊరుకున్నాడు. దాంతో ఆమెకు మండింది. "మీరు రెండో ఎక్కం చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది" అని ఖరాకండీగా చెప్పేసింది.

పెళ్లికొడుకు రెండో ఎక్కం చెప్పలేక నానా తంటాలు పడ్డాడు. దీంతో వధువు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె మండపం నుంచి కిందకు దిగగానే రెండువైపులా కుటుంబ సభ్యులు ఏమైందమ్మా అని అడిగారు. "మీరే చెప్పండి... 2వ ఎక్కం చెప్పలేకపోతున్నారు. అలాంటి ఆయన్ని నేను పెళ్లి చేసుకోవాలా... నాకు ఇష్టం లేదు" అంది. ఎవరు ఏంచెప్పినా ఆమె ఎంతకీ ఒప్పుకోలేదు. రెండువైపులా కుటుంబ సభ్యులకు పెళ్లి ఆగడం ఇష్టం లేదు. అమ్మాయని కన్వీన్స్ చేద్దామని ఆమె ఫ్రెండ్స్‌ని ఆమె దగ్గరకు పంపారు. వారు ఏంచెప్పినా ఆమె ఎంతకీ ఒప్పుకోలేదు. చివరికి పోలీసులు కూడా ఆమెను ఒప్పించాలని చూశారు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లికొడుకు చదువుకోలేదనే విషయం బయటపడటంతో వధువు సీరియస్ అయ్యింది. చదువు రాదనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లిచేయడం ఏంటని అందరూ బాధపడ్డారు. చివరికి పెళ్లి కూతురు నిర్ణయంతో వారు ఆ పెళ్లిని ఆపేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ప్యూకే ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్‌

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>