MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/ramcharan-allu-arjun-pushpa67f6362e-4d9e-4667-9b54-c9824d88e49c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/ramcharan-allu-arjun-pushpa67f6362e-4d9e-4667-9b54-c9824d88e49c-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ హీరోల్లో ప్రస్తుతం ఇంటర్నల్ వార్ నడుస్తోంది. మెగా స్టార్ ఇమేజ్ ని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్తూ మెగా పవర్ స్టార్ దూసుకెళ్తుంటే.. అటు అల్లు అర్జున్ కూడా మెగా ఇమేజ్ ని ఒడిసి పట్టుకోడానికి కష్టపడుతున్నారు. మగధీర టైమ్ లోనే ఆ సినిమా హిట్ ని ఢీకొట్టేలా బద్రీనాథ్ తీశారు అల్లు అర్జున్. అయితే అప్పుడది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత తనదైన శైలిలో వెళ్తున్నా కూడా రామ్ చరణ్ ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ;ntr;ram charan teja;kumaar;shiva;allu arjun;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;sriram;sukumar;venu;india;badrinath temple;rrr movie;cinema;murugadoss;bahubali;hindi;rangasthalam;lord siva;war;vegetable market;local language;a r murugadoss;nandamuri taraka rama rao;arjun 1;geetha arts;venu sreeram;magadheera;badrinath;venu thottempudiరామ్ చరణ్ ని టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్..రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్..;ntr;ram charan teja;kumaar;shiva;allu arjun;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;sriram;sukumar;venu;india;badrinath temple;rrr movie;cinema;murugadoss;bahubali;hindi;rangasthalam;lord siva;war;vegetable market;local language;a r murugadoss;nandamuri taraka rama rao;arjun 1;geetha arts;venu sreeram;magadheera;badrinath;venu thottempudiMon, 03 May 2021 11:00:00 GMTమెగా ఫ్యామిలీ హీరోల్లో ప్రస్తుతం ఇంటర్నల్ వార్ నడుస్తోంది. మెగా స్టార్ ఇమేజ్ ని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్తూ మెగా పవర్ స్టార్ దూసుకెళ్తుంటే.. అటు అల్లు అర్జున్ కూడా మెగా ఇమేజ్ ని ఒడిసి పట్టుకోడానికి కష్టపడుతున్నారు. మగధీర టైమ్ లోనే ఆ సినిమా హిట్ ని ఢీకొట్టేలా బద్రీనాథ్ తీశారు అల్లు అర్జున్. అయితే అప్పుడది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత తనదైన శైలిలో వెళ్తున్నా కూడా రామ్ చరణ్ ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్.

రంగస్థలంతో రామ్ చరణ్ హిట్ కొట్టగానే వెంటనే సుకుమార్ ని లైన్లో పెట్టి పుష్ప సినిమా తీస్తున్నారు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్ చేసిన సినిమాలు ప్రాంతీయ భాషల్లో కూడా ఒకేసారి విడుదలయ్యాయి. ఇప్పుడు హిందీలో కూడా పుష్పతో ఐకాన్ స్టార్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు బన్నీ. ఈ సంగతి పక్కనపెడితే.. తర్వాతి సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ ని టార్గెట్ చేయడం విశేషం.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రామ్ చరణ్. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వస్తన్న ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీగా ఆల్రడీ పేరు తెచ్చుకుంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అందరూ దీని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత అటు చరణ్, ఇటు ఎన్టీఆర్ మార్కెట్ మరింతగా పెరగడం ఖాయం. ఈ దశలో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టిపెట్టారు. రాబోయే సినిమాలన్నీ అన్ని భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రడీ పుష్పతో ఆ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు పుష్ప తర్వాత చాలామంది దర్శకులు తనకోసం ఎదురు చూస్తున్నా కూడా ఏరికోరి మురుగదాస్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కి ఫిక్స్ కావడంతో వేణుశ్రీరామ్ తనకోసం వేచి చూస్తున్నా కూడా అల్లు అర్జున్ మురుగదాస్ కి ఓకే చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అర్జున్ 21వ సినిమా మురుగదాస్ తో ఉంటుందని అంటున్నారు. మురుగదాస్, యూనివర్సల్ సబ్జెక్ట్ తో ప్రధానంగా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని ఈ సినిమా తీస్తారని తెలుస్తోంది. అంటే దాదాపుగా ఇక లోకల్ సబ్జెక్ట్ లను అల్లు అర్జున్ టచ్ చేయరని తెలుస్తోంది. రామ్ చరణ్ ని టార్గెట్ గా పెట్టుకుని స్టెప్ బై స్టెప్ పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నారు ఐకాన్ స్టార్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఖమ్మం కార్పొరేషన్‌ ఫలితాలు..!!

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>