PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajendarba653684-8ddc-4532-9c83-3e6257379d24-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajendarba653684-8ddc-4532-9c83-3e6257379d24-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఎపుడూ దారులు మూసుకుపోయి ఉండవు. ఇది ఒక విశాలమైన క్రీడా మైందానం. ఆట ఎవరు ఎటు నుంచి స్టార్ట్ చేసిన దాన్ని మరో వైపు నుంచి ఆడుతూ తన వైపు తిప్పుకునే నైపుణ్యం చాకచక్యం ఉండాలే కానీ ఆట ఎపుడూ ఆగిపోదు, ఆటగాడికీ ఓటమి కూడా ఉండదు. etela;kcr;eatala rajendar;backward classes;minister;success;etela rajenderఈటల దగ్గర రెండు ఆయుధాలు ?ఈటల దగ్గర రెండు ఆయుధాలు ?etela;kcr;eatala rajendar;backward classes;minister;success;etela rajenderMon, 03 May 2021 10:39:14 GMTరాజకీయాల్లో ఎపుడూ దారులు మూసుకుపోయి ఉండవు. ఇది ఒక విశాలమైన క్రీడా మైందానం. ఆట ఎవరు ఎటు నుంచి స్టార్ట్ చేసిన దాన్ని మరో వైపు నుంచి ఆడుతూ తన వైపు తిప్పుకునే నైపుణ్యం చాకచక్యం ఉండాలే కానీ ఆట ఎపుడూ ఆగిపోదు, ఆటగాడికీ ఓటమి కూడా ఉండదు.

సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం చూస్తే ఇలాంటి సీనే అప్పట్లో జరిగింది. చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కలేదని అసంతృప్తితోనే కేసీయార్ టీడీపీని వదిలి తెలంగాణా రాష్ట్ర సమితిని ప్రారంభించారు. నాడు కేసీయార్ ఒకే ఒక్కడు. ఆయన ఆంత విశ్వాసం, వ్యూహాలు ఇవే ఇంతటి స్థితికి తీసుకువచ్చాయి. ఇపుడు ఈటల రాజెందర్ తీసుకుంటే నాడు కేసీయార్ తో పాటు అడుగులో అడుగు వేసి నడిచిన ఉద్యమకారుడు.

ఈటల రాజేందర్ మీద కేసీయార్ తీసుకున్న కఠిన చర్యల పట్ల యావత్తు తెలంగాణా సమాజంలోనూ చర్చ సాగుతోంది. ఆయన బీసీ వర్గానికి చెందిన వాడు, సమర్ధుడు అయినా నేత, ఆరు సార్లు గెలిచిన ఓటమి లేని నేత.  తనకు ఇచ్చిన రెండు శాఖలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారని అంతా ఒప్పుకునే నిజం.   ఇక ఆయన భూకబ్జాలకు పాల్పడ్డారు అన్నది అభియోగం. అయితే ఈటల రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇన్నాళ్ళూ లేనిది ఇపుడు హఠాత్తుగా ఆయన అవినీతిపరుడుగా ఎలా మారిపోతారు అన్నది సగటు జనాల ప్రశ్నగా కూడా ఉంది. మరో వైపు చూసుకుంటే ఆయన మీద  ఆరోపణలు చేయడం వాటి మీద హడావుడిగా విచారణ జరిపించడం, ఆ వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం వంటివి చూసిన వారికి ఆయన్ని గట్టిగానే టార్గెట్ చేశారు అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.

ఇక్కడ ఈటల ఫ్యామిలీ భూ కబ్జాలకు పాల్పడిందా లేదా అన్నది వెనక్కి పోయి ఆయన గొంతు కోశారు అన్న సానుభూతే ముందుకు వస్తోంది. దాంతో ఈటల అమ్ముల పొదిలో రెండు ఆయుధాలు రెడీగా ఉన్నాయన్న మాట. ఆయనకు బీసీ కార్డు, సింపతీ కార్డు రెండూ కూడా వర్కౌట్ అయితే మాత్రం కచ్చితంగా తెలంగాణా రాజకీయాలు కొత్త మలుపు తీసుకోవడం ఖాయం. ఏది ఏమైన ఉద్యమకారుడిగా ఉన్న ఈటల మీద వేటు వేయడం ద్వారా ఆయన్ని పొలిటికల్ గా ఒక్కసారిగా పెంచేశారు అన్న చర్చ కూడా నడుస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఖమ్మం కార్పొరేషన్‌ ఫలితాలు..!!

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>