PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionresults2021c2668d9e-7a75-4891-bdb3-49de06490de2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionresults2021c2668d9e-7a75-4891-bdb3-49de06490de2-415x250-IndiaHerald.jpgకేరళవాసులు మరోసారి లెఫ్ట్ పార్టీకే లాల్ సలాం అన్నారు. పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎ్‌ఫకే తిరిగి అధికారాన్ని కటబెట్టి ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టదనే నాలుగు దశాబ్దాల సెంటిమెంట్ ను మార్చారు. ఎన్డీయే తరఫున ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ.. కేరళ వాళ్లను హిందూత్వం పేరుతో ఓట్లు అడిగేందుకు చేసిన స్వామియే శరణం అయ్యప్పా.. అనే నినాదం చేసినా అది బీజేపీకి ఓట్లను రాల్చలేకపోయింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కూడా మిగతా చోట్ల కంటే కేరళలో తమకు అవకాశాలు కలిసి వస్తాయి ఏమో అని చvijayan;tiru;kerala;pinarayi vijayan;narendra modi;prime minister;partyఅఖండ విజయం విజయన్ ను మారుస్తుందా ?అఖండ విజయం విజయన్ ను మారుస్తుందా ?vijayan;tiru;kerala;pinarayi vijayan;narendra modi;prime minister;partyMon, 03 May 2021 12:00:00 GMTకేరళవాసులు మరోసారి లెఫ్ట్ పార్టీకే లాల్ సలాం అన్నారు. పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎ్‌ఫకే తిరిగి అధికారాన్ని కటబెట్టి ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టదనే నాలుగు దశాబ్దాల సెంటిమెంట్ ను మార్చారు. ఎన్డీయే తరఫున ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ.. కేరళ వాళ్లను హిందూత్వం పేరుతో ఓట్లు అడిగేందుకు చేసిన స్వామియే శరణం అయ్యప్పా.. అనే నినాదం చేసినా అది బీజేపీకి ఓట్లను రాల్చలేకపోయింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కూడా  మిగతా చోట్ల కంటే కేరళలో తమకు అవకాశాలు కలిసి వస్తాయి ఏమో అని చేసిన ప్రచారం యూడీఎఫ్‌ కూటమికి విజయాన్ని అందించలేకపోయింది. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో.. వామపక్ష కూటమి 99 సీట్లను కైవసం చేసుకుంది. 

మూడో కూటమికి స్థానం ఇవ్వకుండా.. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ అభ్యర్థులనే గెలిపించారు. ఎల్‌డీఎఫ్‌ మొత్తం 99 స్థానాల్లో విజయం సాధించగా మిగతా 41 స్థానాలను యూడీఎఫ్‌ కూటమి కైవసం చేసుకుంది. ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీయే ఒక్క స్థానంలో కూడా పాగా వేయలేకపోయింది. 2016 ఎన్నికల్లో కైవసం చేసుకున్న నేమోమ్‌ స్థానాన్నీ కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. కాసర్‌గోడ్‌, కన్నూర్‌, కోళిక్కోడ్‌, పాలక్కాడ్‌, త్రిస్సూర్‌, పథనంతిట్ట, అలప్పుళ, కొల్లం, తిరువనంతపురం జిల్లాల్లో అన్ని స్థానాలను లెఫ్ట్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 

మిగతా జిల్లాల్లో ఎల్‌డీఎ్‌ఫ-యూడీఎఫ్‌ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. నిజానికి ఒక రకంగా కేరళ లో పినరయి విజయన్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చిందనే వాదన వినిపించింది. కొన్ని నిర్ణయాలు ప్రజలకు నచ్చలేదని ప్రజా వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాల కారణంగా పార్టీకి ఓటమి తప్పదని విశ్లేషకులు సైతం వినిపించాయి. వాటన్నిటినీ పక్కనపెట్టి పినరయి విజయన్ మరోసారి సీఎం కాబోతున్నారు. మరి ఈసారి ఆయన పాలన ఎలా ఉండబోతోంది ? గత పాలన మీద రివ్యూ చేసుకుని ఆయన తన పంధా మార్చుకుంటారు ఏమో చూడాలి. లేదా ఇలా ఉన్నా సరే ప్రజలు తనకు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఇలాగే పరిపాలిస్తాను అంటారో చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

ఆచార్యకు ఇంకొన్ని రోజులే..?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>