PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender0f39a4fd-a145-43a0-8f8b-4f2b704819b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender0f39a4fd-a145-43a0-8f8b-4f2b704819b3-415x250-IndiaHerald.jpgఅడ‌పాద‌డ‌పా త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుతున్నా ఎక్క‌డా కేసీఆర్‌ను కానీ, తెరాస నేత‌ల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. అయితే ఈట‌ల వ్యూహాత్మ‌కంగా ఆలోచ‌న చేస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతుంది. ఏ ప‌ద‌వీ ఆత్మాభిమానం, ఆత్మ గౌర‌వం కంటే పెద్ద‌వి కావ‌ని వ్యాఖ్యానించిన ఈట‌ల రాజేంద‌ర్ తాజా ప‌రిణామాల‌తో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో పార్టీ బీ-ఫారం మీద ఎమ్మెల్యేగా గెలిచినందున శాస‌న స‌భ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసే యోచ‌న‌లో ఈటల ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎలాగూ etela rajender;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;రాజీనామా;partyఈట‌ల ప‌య‌ణ‌మెటు .. ఉపఎన్నిక త‌ప్ప‌దా?ఈట‌ల ప‌య‌ణ‌మెటు .. ఉపఎన్నిక త‌ప్ప‌దా?etela rajender;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;రాజీనామా;partyMon, 03 May 2021 06:50:36 GMTతెలంగాణ రాజ‌కీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈట‌ల నుండి వైద్య ఆరోగ్య‌శాఖ‌ను త‌న‌కు బ‌ద‌లాయించుకున్న కేసీఆర్‌.. తాజాగా ఈట‌ల‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఈట‌ల‌ను పార్టీ నుంచిసైతం బ‌హిష్క‌రిస్తారా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వేగంగా జ‌రుగుతున్న నిర్ణ‌యాల‌పై ఈట‌ల కాస్త మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌య‌ణ‌మెటు అన్న ప్ర‌శ్న ఆస‌క్తిక‌రంగా మారింది.

వ‌రుస ప‌రిణామాల‌తో ఈట‌ల మౌనంగానే ఉంటున్నారు. అడ‌పాద‌డ‌పా త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుతున్నా ఎక్క‌డా కేసీఆర్‌ను కానీ, తెరాస నేత‌ల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. అయితే ఈట‌ల వ్యూహాత్మ‌కంగా ఆలోచ‌న చేస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతుంది. ఏ ప‌ద‌వీ ఆత్మాభిమానం, ఆత్మ గౌర‌వం కంటే పెద్ద‌వి కావ‌ని వ్యాఖ్యానించిన ఈట‌ల రాజేంద‌ర్ తాజా ప‌రిణామాల‌తో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో పార్టీ బీ-ఫారం మీద ఎమ్మెల్యేగా గెలిచినందున శాస‌న స‌భ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసే యోచ‌న‌లో ఈటల ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎలాగూ పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. రేపో ఎల్లుండో ఈ నిర్ణ‌యం అమ‌లుచేస్తార‌ని భావిస్తున్న ఈట‌ల.. ముందుగానే పార్టీని వీడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

శాస‌న స‌భ స‌భ్య‌త్వానికిసైతం రాజీనామా చేయ‌డం ద్వారా రాబోయే కాలంలో ఉప ఎన్నిక‌నుసైతం ఎదుర్కొనేందుకు ఈట‌ల సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్‌లు ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. దీనికితోడు ఇన్నేళ్లుగా పార్టీబ‌లోపేతం కోసం క‌ష్ట‌ప‌డినా కేసీఆర్ కావాల‌నే పార్టీ నుంచి బ‌లవంతంగా బ‌య‌ట‌కు పంపించార‌న్న సానుభూతి ప్ర‌జ‌ల్లో ఎలాగూ ఉండ‌నే ఉంటుంద‌ని భావిస్తున్న ఈట‌ల ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ల‌ట‌మే బెట‌ర్ అన్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న అనుచ‌రుల‌తో భేటీ అయ్యి, ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఈట‌ల అనుచ‌రులు పేర్కొంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కళ్యాణ్ రామ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>