PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bengalce43d39f-b2c2-41bd-a395-918bd1907e58-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bengalce43d39f-b2c2-41bd-a395-918bd1907e58-415x250-IndiaHerald.jpgఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు కొన్ని రాజకీయ పార్టీలపైన తీవ్ర ప్రభావం చూపాయి. వాటిలో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీని చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్‌ను దాదాపు 34 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పరిపాలించింది. బెంగాల్‌లో 1977లో ప్రారంభం అయిన లెఫ్ట్ ఫ్రంట్ నాయకత్వానికి 2011లో బ్రేక్ పడింది. అప్పటి నుంచి రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ దుస్థితి అంతకంతా దిగజారుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ మరీ దయనీయ పరిస్థితికి చేరుకుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పొత్తు చేసుకొని పోటీ చేసినా ఫలితం..bengal;mamata benerjee;benarjee;hari;hari music;india;american samoa;congress;2019;contract;bengali;cpi;mamta mohandas;partyకనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..bengal;mamata benerjee;benarjee;hari;hari music;india;american samoa;congress;2019;contract;bengali;cpi;mamta mohandas;partyMon, 03 May 2021 11:16:15 GMTకోల్‌కతా: ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు కొన్ని రాజకీయ పార్టీలపైన తీవ్ర ప్రభావం చూపాయి. వాటిలో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీని చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్‌ను దాదాపు 34 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పరిపాలించింది. బెంగాల్‌లో 1977లో ప్రారంభం అయిన లెఫ్ట్ ఫ్రంట్ నాయకత్వానికి 2011లో బ్రేక్ పడింది. అప్పటి నుంచి రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ దుస్థితి అంతకంతా దిగజారుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ మరీ దయనీయ పరిస్థితికి చేరుకుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పొత్తు చేసుకొని పోటీ చేసినా ఫలితం లేక పోయింది. కనీసం ఒక్క సీటు కూడా దక్కించులేకపోయింది. అయితే ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు, భూ సంస్కరణలతో అందరినీ ఆకట్టుకుని బెంగాల్‌ను పాలించిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం పరిస్థితులు రావడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

వీటిలో ప్రధానంగా 2008లో భారత్-అమెరికా అణు ఒప్పందంపై కమ్యూనిస్టులు స్పందించిన తీరును చెప్పుకోవాలి. ఈ అణు ఒప్పందాన్ని తిరస్కరించిన లెఫ్ట్ పార్టీలు అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి తాము ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకున్నాయి. దాంతో కాంగ్రెస్ వెంటనే కమ్యూనిస్టులను పక్కనపెట్టి తృణమూల్‌తో చేతులు కలిపింది. అంతే అప్పుడు మొదలైంది కమ్యూనిస్టుల పతనం. అదే విధంగా తృణమూల్ ఆధిక్యత ప్రారంభం అయింది. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో తృణమూల్ పైచేయి సాధించింది.

అంతేకాకుండా అంతకు ముందు సంవత్సరం అంటే 2007లో జరిగిన భూసేకరణ వ్యతిరేక పోరాటంలో తృణమూల్ అధినేతమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రధానంగా కనిపించారు. ఆ తర్వాతి ఏడాది 2008లో కమ్యూనిస్టులు యూడీఏను వ్యతిరేకించడం, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను వదిలి తృణమూల్‌తో జతకట్టడం జరిగింది. అంతే ఆ ఏడాది జరిగిన పంచాయితీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. అప్పటి నుంచి మొదలుకొని అతితక్కువ సమయంలోనే అనేక వర్గాలు కమ్యూనిస్టులకు దూరమయ్యాయి.

అదే తరహాలో లెఫ్ట్ పార్టీలకు వరుసగా పరాభవాలు ఎదరవుతూ వచ్చాయి. 2011లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం 40 సీట్లు గెలవగా సీపీఐ కేవలం 2 సీట్లకే పరిమితమయింది. అప్పుడే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ మొదటిసారి ప్రభుత్వాన్ని నిర్మించింది. ఆ తర్వాత 2016లో జరిగిన శాసనసభ ఎన్నకల్లోను లెఫ్ట్ పార్టీలకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో సీపీఎం 26 స్థానాలకు దిగజారగా సీపీఐ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇక 2019 ఎన్నికల్లో బెంగాలీ ప్రజలు లెఫ్ట్ పార్టీలను దాదాపు మర్చిపోయారనిపించింది. ఆ ఏడాది ఎన్నికల్లో కమ్యూనిస్టులకు వచ్చిన ఓట్ల శాతం 6.34 శాతానికి చేరుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా లెఫ్ట్ పార్టీలకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఘోర పడవ ప్రమాదం..!!

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

ఆచార్యకు ఇంకొన్ని రోజులే..?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>