PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/municipal-elections632b3339-93b9-4622-8381-3f85c8c00494-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/municipal-elections632b3339-93b9-4622-8381-3f85c8c00494-415x250-IndiaHerald.jpgఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లను అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. హైద‌రాబాద్ త‌రువాత ఈ రెండు పెద్ద పుర‌పాలిక‌లు కావ‌డంతో గెలుపు బావుటా ఎగుర‌వేయాల‌ని నేత‌లు, అభ్య‌ర్థులు విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. వ‌రంగ‌ల్‌లో 66 డివిజ‌న్‌లు ఉండ‌గా, ఖ‌మ్మంలో 60 డివిజ‌న్‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వ‌రంగ‌ల్‌లో 50కుపైగా డివిజ‌న్‌లు గెలుస్తామ‌ని, ఖ‌మ్మంలో 45 నుంచి 50 డివిజ‌న్‌ల‌లో విజ‌యం సాధిస్తామ‌ని అధికార పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు.municipal elections;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;central government;kothur;petta;partyఆ రెండింటిపైనే అంద‌రిచూపు .. తెరాస దూకుడు కొన‌సాగేనాఆ రెండింటిపైనే అంద‌రిచూపు .. తెరాస దూకుడు కొన‌సాగేనాmunicipal elections;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;central government;kothur;petta;partyMon, 03 May 2021 07:54:50 GMTమినీ పుర‌పోరులో విజేత‌లెవ‌రో మ‌రికొద్దిసేప‌ట్లో తేల‌నుంది. ఉద‌యం 8గంట‌ల‌కు ప్రారంభ‌మైన లెక్కింపు ప్ర‌క్రియ సాయంత్రం వ‌ర‌కు సాగ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కార్పొరేష‌న్ లు, ఐదు మున్సిపాలిట‌ల్లో ఏప్రిల్ 30న కొవిడ్ నిబంధ‌న‌ల మ‌ధ్య ఎన్నిక‌లు జ‌రిగాయి. క‌రోనా కార‌ణంగా న‌కిరేక‌ల్‌, కొత్తూరు మిన‌హా ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లు, సిద్ధిపేట‌, అచ్చంపేట‌, జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీల్లో పోలింగ్ త‌క్కువ‌గా న‌మోదైంది. అయితే అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు గెలుపు ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి.

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లను అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. హైద‌రాబాద్ త‌రువాత ఈ రెండు పెద్ద పుర‌పాలిక‌లు కావ‌డంతో గెలుపు బావుటా ఎగుర‌వేయాల‌ని నేత‌లు, అభ్య‌ర్థులు విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. వ‌రంగ‌ల్‌లో 66 డివిజ‌న్‌లు ఉండ‌గా, ఖ‌మ్మంలో 60 డివిజ‌న్‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వ‌రంగ‌ల్‌లో 50కుపైగా డివిజ‌న్‌లు గెలుస్తామ‌ని, ఖ‌మ్మంలో 45 నుంచి 50 డివిజ‌న్‌ల‌లో విజ‌యం సాధిస్తామ‌ని అధికార పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. ప్ర‌తిప‌క్ష బీజేపీ, కాంగ్రెస్ నేత‌లుసైతం మేమే గెలుస్తామంటున్నారు. అయితే ఈ రెండు కార్పొరేష‌న్‌ల‌లో ఓటింగ్ శాతం త‌క్కువ‌గానే న‌మోదైంది. త‌గ్గిన ఓటింగ్ ఎవ‌రికి క‌లిసివస్తుందో మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంది.

ఐదు మున్సిపాలిటీల్లో సిద్ధిపేట క్లీన్ స్వీప్ చేస్తామ‌ని తెరాస నేత‌లు చెబుతున్నారు. మంత్రి హ‌రీష్‌రావు ఇలాకా కావ‌డంతో గెలుపు న‌ల్లేరుపై నడ‌కేన‌ని అధికార పార్టీ భావిస్తుంది. ఇక ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో జ‌డ్చ‌ర్ల‌, అచ్చంపేట మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగర‌డం ఖాయ‌మ‌న్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మాత్రం ఈ రెండు మున్సిపాలిటీల్లో మేమే గెలుస్తామ‌ని దీమాతో ఉన్నారు. న‌కిరేక‌ల్‌, కొత్తూరులోసైతం అధికార తెరాస పార్టీదే హ‌వాఅని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లేవారికి త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నెగిటివ్ స‌ర్టిఫికెట్ ఉండాల్సిందే. లేకుంటే లోనికి అనుమ‌తించ‌మ‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఫ‌లితాల త‌రువాత విజ‌యోత్స‌వ ర్యాలీల‌ను నిషేదిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>