PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaelectionresult935caded-4540-4d82-ae91-ae7b78e0874e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaelectionresult935caded-4540-4d82-ae91-ae7b78e0874e-415x250-IndiaHerald.jpgఅచ్చంపేట‌లో మొత్తం 20వార్డులు ఉన్నాయి. 20వార్డుల‌కు గాను కాంగ్రెస్‌, బీజేపీ, తెరాస త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపింది. ఆరుగురు స్వ‌తంత్ర్య అభ్యర్థులుగా బ‌రిలోకి దిగారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో 20 వార్డుల్లో తెరాస అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఏ ఒక్క వార్డులోనూ పాగా వేయ‌లేక పోయాయి. కానీ ఈద‌ఫా కాంగ్రెస్ పార్టీ అధికార తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌చార స‌మ‌యంలో అచ్చంపేట‌లో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణల మ‌ధ్య మాట‌ల తూటtelanganaelectionresult;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mla;petta;partyఅచ్చంపేట పీఠం తెరాస‌దే .. షాకిచ్చిన కాంగ్రెస్‌!అచ్చంపేట పీఠం తెరాస‌దే .. షాకిచ్చిన కాంగ్రెస్‌!telanganaelectionresult;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mla;petta;partyMon, 03 May 2021 14:24:27 GMTతెలంగాణ వ్యాప్తంగా 30న జ‌రిగిన రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నిక‌ల‌కు సంబంధించి సోమ‌వారం ఓట్ల లెక్కింపు సాగుతుంది. కార్పొరేష‌న్‌లు, మున్సిపాలిటీల్లో అధికార తెరాస‌నే ముంద‌జ‌లో ఉంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో రెండు మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీలో అధికార తెరాస పార్టీ చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకోగా, అచ్చంపేట మున్సిపాలిటీలోనూ తెరాసదే పైచేయిగా నిలిచింది. అయితే ఇక్క‌డ ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఆరు వార్డుల్లో విజ‌యం సాధించ‌డంతోపాటు మిగిలిన వార్డుల్లో తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు.

అచ్చంపేట‌లో మొత్తం 20వార్డులు ఉన్నాయి. 20వార్డుల‌కు గాను కాంగ్రెస్‌, బీజేపీ, తెరాస త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపింది. ఆరుగురు స్వ‌తంత్ర్య అభ్యర్థులుగా బ‌రిలోకి దిగారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో 20 వార్డుల్లో తెరాస అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఏ ఒక్క వార్డులోనూ పాగా వేయ‌లేక పోయాయి. కానీ ఈద‌ఫా కాంగ్రెస్ పార్టీ అధికార తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌చార స‌మ‌యంలో అచ్చంపేట‌లో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. ఈద‌ఫాసైతం అచ్చంపేట‌లో క్లీన్‌స్వీప్ చేస్తామ‌ని గువ్వ‌ల స‌వాల్ చేశారు. ఈ క్ర‌మంలో తెరాస నేత‌లు అచ్చంపేట‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డుల‌కు గాను టీఆర్ ఎస్ 13 వార్డుల్లో విజ‌యం సాధించింది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఆరు వార్డుల్లో విజ‌యం సాధించారు. ఇక బీజేపీ ఒక్క స్థానంతో స‌రిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ చైర్మ‌న్ అభ్య‌ర్థిని ముందుగానే ప్ర‌క‌టించి బ‌రిలోకి వెళ్ల‌డం, తెరాస చైర్మ‌న్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌క పోవ‌టంతో కాంగ్రెస్‌కు క‌లిసొచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. తెరాస మున్సిప‌ల్ చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌టంతో ఇప్పుడు చైర్మ‌న్ స్థానంకు ఎవ‌రు ఎంపిక‌వుతారా అన్న ఉత్కంఠ నెల‌కొంది. ఇక్క‌డ చైర్మ‌న్ పీఠం జ‌న‌ర‌ల్ కావ‌డంతో  పోటీ ఎక్కువ‌గానే ఉంది. ప‌లువురు చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అయితే న‌ర్సింహ‌గౌడ్ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తుంది. ఈయ‌న‌కే చైర్మ‌న్ పీఠం ద‌క్కుతుంద‌ని స‌మాచారం. మొత్తానికి అచ్చంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పుంజుకుంద‌నే చెప్ప‌వ‌చ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: టీడీపీ కీల‌క నేత‌, మాజీ ఎంపీ మృతి

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>