PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/chandrababu-tdp-aljimars-kvp-jagan-ycp-corona-virus18e8d813-09bb-476c-8123-bebb232480d8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/chandrababu-tdp-aljimars-kvp-jagan-ycp-corona-virus18e8d813-09bb-476c-8123-bebb232480d8-415x250-IndiaHerald.jpgరాజకీయాలు ఇపుడు చాలా మారిపోయాయి. అవును ఇది సోషల్ మీడియా రాజ్యమేలుతున్న యుగం. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే చాలు దాని వెనకా ముందూ కూడా అనేక విశ్లేషణలు చేయగల దిట్టలు సోషల్ మీడియా నిండా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ap;jagan;andhra pradesh;media;central government;nijamకిం కర్తవ్యం... ?కిం కర్తవ్యం... ?ap;jagan;andhra pradesh;media;central government;nijamMon, 03 May 2021 10:21:10 GMTరాజకీయాలు ఇపుడు చాలా మారిపోయాయి. అవును ఇది సోషల్ మీడియా రాజ్యమేలుతున్న యుగం. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే చాలు దాని వెనకా ముందూ కూడా అనేక విశ్లేషణలు చేయగల దిట్టలు సోషల్ మీడియా నిండా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

ఎక్కడో ఏదో జరిగిపోతుందని కలరింగ్ ఇస్తూ జనాలను మభ్యపెట్టే  రాజకీయం చేద్దామంటే అసలు కుదరదు, ఏ నాయకుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఆయన మాటల వెనక ఉన్న మతలబు ఏంటి అన్నది జనాలకు బాగా అర్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జనాలతో కనెక్ట్ అవుతూనే రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏపీలో చూసుకుంటే రెండేళ్ళు అయినా విపక్షం ఎత్తిగిల్లలేదు. దానికి కారణాలు ఏంటి అని చర్చిస్తే చాలానే ఉంటాయి. ప్రత్యేకించి ప్రజా సమస్యల విషయంలో విపక్ష నేతలు సీరియస్ గా దృష్టి సారించడంలేదు అన్నది వాస్తవం. మరో వైపు చూస్తే జాతీయ సమస్యలు తెచ్చి ఏపీ సర్కార్ మీద విమర్శలు చేయడాన్ని కూడా జనాలు గమనిస్తున్నారు. ఇపుడు ఉన్న ప్రజలకు జాతీయ స్థాయిలో కేంద్రం ఏ చర్యలు తీసుకోవాలో, రాష్ట్రాల పరిధిలో ఏ అంశాలు తీసుకోవాలో బాగా తెలుసు.

అందుకే కరోనా వంటి సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నపుడు కేవలం ఏపీ సర్కార్ ని పట్టుకుని నిందించడంలో ఔచిత్యాన్ని జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఏపీ లాంటి రాష్ట్రలో ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగితే వెంటనే దాన్ని పట్టుకుని జగన్ కి ఆపాదించేస్తూ చేసే ద్వేష పూరిత రాజకీయాలను జనాలు అర్ధం చేసుకుంటున్నారు. నిజంగా కరెక్ట్ సమస్య అయితే దాంట్లో ప్రభుత్వానిది తప్పు ఉంటే అపుడు విమర్శ చేసినా అర్ధం ఉంటుంది.

సహేతుకమైన విమర్శలు చేయకపోవడం వల్లనే ఏపీలోని విపక్షాలు రెండేళ్ళుగా కిందా మీదా అవుతున్నాయి అన్నది కూడా వినిపిస్తున్న మాట. ఇక ఏపీలో మరో చిత్రం కూడా ఉంది. ప్రభుత్వం మీద పీకల బండెడు వ్యతిరేకత ఉందని తాము భావిస్తూ జనాలను కూడా ఆ భ్రమలలో ఉంచడం. నిజానికి అలా కనుక ఉంటే ప్రజలు  విపక్షం వెంట నడిచే వారే. సమస్య ఉన్న చోట కచ్చితంగా వాదించాలి, నిలబడాలి, నిలదీయాలి. కానీ జరుగుతున్న తంతు వేరు. అందుకే ఇపుడు ఏపీలో విపక్షాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పాలి. ఏది ఏమైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడం ద్వారానే జనాల మెప్పు పొందగలరు అన్నది వాస్తవం.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>