PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu380efffc-e85c-4be5-9508-c52dc9df390f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu380efffc-e85c-4be5-9508-c52dc9df390f-415x250-IndiaHerald.jpgఅయితే.. ప్ర‌భుత్వ వాద‌న మ‌రోవిధంగా ఉంది. గ‌తంలో స‌ద‌రు ప్రాంతాన్ని విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు ప‌ల్లా రాసేశార‌ని.. కానీ, ఆ త‌ర్వాత‌.. ఆ స్థ‌లంలోనే ఆయ‌న నిర్మాణాలు చేశార‌ని.. దీంతో తాము స‌ద‌రు ఆక్ర‌మిత భ‌వ‌నాల‌ను తీసేయాల‌ని నోటీసు లు ఇచ్చామ‌ని.. అయినా విన‌లేద‌ని.. అందుకే.. రోడ్డు విస్త‌ర‌ణ‌లో భాగంగా.. భ‌వ‌నాన్ని కూల్చేశామని పేర్కొంటూ.. దీనికి సంబం ధించిన ప‌త్రాల‌ను విడుద‌ల చేశారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై విరుచుకుప‌డిన‌.. టీడీపీ నాయ‌కులకు ఈ ఆధారాల‌తో ఏం చేయాలో తోచ‌లేదు. ఈ క్ర‌మంలో ఏదో chandrababu;backward classes;vishakapatnam;media;court;mla;minister;letter;tdp;ycpబాబు కులం కార్డు తేడా కొడుతోందిగా...!బాబు కులం కార్డు తేడా కొడుతోందిగా...!chandrababu;backward classes;vishakapatnam;media;court;mla;minister;letter;tdp;ycpMon, 03 May 2021 10:07:13 GMT``ప్ర‌తి విష‌యానికీ కులం కార్డు ఎందుకు సార్‌! ఇదేమ‌న్నా ఎన్నిక‌ల సీజ‌నా? ఇప్పుడు అన్ని ఎన్నిక‌లు అయిపోయాయి క‌దా! ఇంకా కులం కార్డును ప‌ట్టుకుని వేలాడ‌తారెందుకు!!``-ఇదీ.. టీడీపీ సీనియ‌ర్ల‌ను ఉద్దేశించి.. నెటిజ‌న్లు.. సోష‌ల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. ఇటీవ‌ల‌ విశాఖ‌ప‌ట్నం జిల్లాలో.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావుకు చెందిన ఓ భ‌వాన్ని విశాఖ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు కూల్చేశారు. దీంతో ఇది పెద్ద వివాదం అయింది. ప‌ల్లా ఏకంగా కోర్టుకు వెళ్లి.. కోర్టు నుంచి అనుమ‌తి తెచ్చుకుని తిరిగి నిర్మించుకుంటాన‌ని చెప్పారు.

అయితే.. ప్ర‌భుత్వ వాద‌న మ‌రోవిధంగా ఉంది. గ‌తంలో స‌ద‌రు ప్రాంతాన్ని విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు ప‌ల్లా రాసేశార‌ని.. కానీ, ఆ త‌ర్వాత‌.. ఆ స్థ‌లంలోనే ఆయ‌న నిర్మాణాలు చేశార‌ని.. దీంతో తాము స‌ద‌రు ఆక్ర‌మిత భ‌వ‌నాల‌ను తీసేయాల‌ని నోటీసు లు ఇచ్చామ‌ని.. అయినా విన‌లేద‌ని.. అందుకే.. రోడ్డు విస్త‌ర‌ణ‌లో భాగంగా.. భ‌వ‌నాన్ని కూల్చేశామని పేర్కొంటూ.. దీనికి సంబం ధించిన ప‌త్రాల‌ను విడుద‌ల చేశారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై విరుచుకుప‌డిన‌.. టీడీపీ నాయ‌కులకు ఈ ఆధారాల‌తో ఏం చేయాలో తోచ‌లేదు. ఈ క్ర‌మంలో ఏదో ఒక విధంగా ప్ర‌భుత్వంపై  అయితే.. విమ‌ర్శ‌లు గుప్పించాల‌ని భావించారు.

ఈ స‌మ‌యంలో వారికి అందివ‌చ్చిన అవ‌కాశం కులం కార్డు! వెంట‌నే ప‌ల్లా శ్రీనివాస‌రావు బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత అని.. ఆయ‌న‌ను వేధించ‌డం ద్వారా.. రాష్ట్రంలోని బీసీల‌కు నిలువ నీడ‌లేకుండా చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక‌ల్పించింద‌ని.. టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున విరుచుకుప‌డ్డారు. ఇక‌, ఈ క్ర‌మంలో గ‌తంలో బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కుమార్ అరెస్టును కూడా తెర‌మీదికి తెచ్చారు. ఇలా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స‌హా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు సీనియ‌ర్లు కామెంట్లు కురిపించారు. ఈ కామెంట్ల‌పైనే నెటిజ‌న్లు సీరియ‌స్ అయ్యారు.

``ఎన్నిక‌ల స‌మ‌యంలో కులం కార్డు వాడినా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని.. కానీ.. ఇప్పుడు ఎలాంటి ఎన్నిక‌లు లేకుండా ఈ ఫీట్లు ఎందుకు? అయినా.. జ‌రిగింది ఒక‌టి.. మీరు చేస్తున్న వ్యాఖ్య‌లు, వాడుతున్న కులం కార్డుకు ఏమీ సంబంధం లేదు`` అని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై స్పందించిన టీడీపీ డిజిట‌ల్ మీడియా విభాగం.. ఇవ‌న్నీ.. వైసీపీ నేత‌లే చేయిస్తున్నార‌ని ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనాప్ర‌తి విష‌యానికీ .. కులం కార్డు వాడ‌డం టీడీపీకి ప‌రిపాటిగా మారింద‌నేది మాత్రం వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా..!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆచార్యకు ఇంకొన్ని రోజులే..?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>