Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl42dba5c0-ba61-4775-9bf5-facd1cdaea37-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl42dba5c0-ba61-4775-9bf5-facd1cdaea37-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఐపీఎల్ లోని ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఊహకందని విధంగా ఉంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రతి ఆటగాడు కూడా ఐపీఎల్ సూపర్ హీరో గా మారిపోయి జట్టును గెలిపించడం లో కీలక పాత్ర వహిస్తున్నారు. ఇలా ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఐపీఎల్. ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో మజా ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తIpl;yajamanya;hyderabad;cricket;rajasthan;hero;ben stokes;prasthanam;paruguసూపర్ సెంచరీతో.. బట్లర్ రికార్డ్..?సూపర్ సెంచరీతో.. బట్లర్ రికార్డ్..?Ipl;yajamanya;hyderabad;cricket;rajasthan;hero;ben stokes;prasthanam;paruguMon, 03 May 2021 10:00:11 GMTహీరో గా మారిపోయి జట్టును గెలిపించడం లో కీలక పాత్ర వహిస్తున్నారు.  ఇలా ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఐపీఎల్. ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో మజా ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఐపీఎల్ సీజన్ లో మొదటి నుంచి పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ గా  విలియంసన్ వచ్చినప్పటికీ జట్టు దశదిశ మాత్రం ఎక్కడా మారలేదు. అదే పేలవా ప్రదర్శనతో మరోసారి నిరాశ పరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సునామీలో సన్రైజర్స్ కొట్టుకు పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  సన్రైజర్స్ బౌలింగ్ విభాగాన్ని రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్  ఆట ఆడుకున్నాడు.  పరుగుల వరద పారిస్తూ సన్రైజర్స్ బౌలర్లు అందరూ తలలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు.



 సూపర్ సెంచరీతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసి అదరగొట్టిన జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ పై అద్భుతమైన సెంచరీ చేసి ఐపీఎల్ లో సెంచరీ సాధించిన నాలుగవ ఇంగ్లీష్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ ప్రస్థానంలో జోస్ బట్లర్ కు ఇది మొదటి సెంచరీ కావడం గమనార్హం. దీంతో కెవిన్ పీటర్సన్, బ్రెయిన్ స్ట్రో, బెన్ స్టోక్స్ సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 64 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>