PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-test5f179b09-c902-475b-88a7-d408b08ab4f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-test5f179b09-c902-475b-88a7-d408b08ab4f7-415x250-IndiaHerald.jpgక‌రోనా కేసులు పెరుగుతున్న వేళ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కేసుల‌ను గుర్తించేందుకు అధికారులు న‌డుంబిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌లిగిన వారిని గుర్తించ‌నున్నారు. దీనిలోభాగంగా ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జీహెచ్ఎంసీలో తాజా క‌రోనా ప‌రిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్ స‌మీక్షించారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, జీహెచ్ ఎంసీ డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.carona test;kcr;kumaar;telangana rashtra samithi trs;survey;central governmentతెరాస స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం .. గ్రేట‌ర్‌లో ఇంటింటి స‌ర్వే!తెరాస స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం .. గ్రేట‌ర్‌లో ఇంటింటి స‌ర్వే!carona test;kcr;kumaar;telangana rashtra samithi trs;survey;central governmentMon, 03 May 2021 11:59:06 GMTతెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా సోమ‌వారం 5695 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485 కి చేరింది. ఇందులో 3,73,933 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 80,135  కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా 49 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,417కి చేరింది.  ఇదిలాఉంటే జీహెచ్ ఎంసీలో  క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

క‌రోనా కేసులు పెరుగుతున్న వేళ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కేసుల‌ను గుర్తించేందుకు అధికారులు న‌డుంబిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌లిగిన వారిని గుర్తించ‌నున్నారు. దీనిలోభాగంగా ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జీహెచ్ఎంసీలో తాజా క‌రోనా ప‌రిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్ స‌మీక్షించారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, జీహెచ్ ఎంసీ డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి, ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రం, బ‌స్తీ ద‌వాఖానాల్లో ఔట్ పేషంట్ల క్లీనిక్‌ను ప్రారంభించాల‌ని సీఎస్ ఆదేశించారు. మ‌రోవైపు కొవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి స‌రియైన ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ఇంటింటి స‌ర్వేను చేప‌ట్టేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇంటింటికి స‌ర్వే నిర్వ‌హించే బృందంలో ఇద్ద‌రు మున్సిప‌ల్ స్టాఫ్‌, ఇద్ద‌రు ఆశా వ‌ర్క‌ర్లు, ఒక ఏఎన్ఎం ఉండ‌నున్నారు. ఈ బృందాలు త‌మ‌కు కేటాయించిన ఏరియాల్లో ప్ర‌తీ ఇంటికి వెళ్లి జ్వ‌రం, ఇత‌ర ల‌క్ష‌ణాలు ఏమైనా ఉంటే వారికి కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌వేళ క‌రోనా పాజిటివ్ వ‌స్తే హోం ఐసోలేష‌న్‌లో ఉంచి వారికి త‌గిన మందుల‌ను పంపిణీ చేయ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉండి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌నున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా బిజెపికి బొమ్మ లేదా...?

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

ఆచార్యకు ఇంకొన్ని రోజులే..?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>