MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasen-thamilandu-ealcation-loss-of-cm-set-2d07db5f-2bcf-4e71-bca4-127467c714c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasen-thamilandu-ealcation-loss-of-cm-set-2d07db5f-2bcf-4e71-bca4-127467c714c5-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సినిమాలలో ప్రజలకు సేవ చేయాలనే కథలతో మన ముందుకు వస్తూ ఉంటారు.. ఇది కేవలం రీల్ లైఫ్ తోనే ఆగకుండా రియల్ లైఫ్లో కూడా ప్రజలకు సహాయం చేయాలని ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోలను మనం ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి ,నాగబాబు , రజనీకాంత్ ,కమల్ హాసన్ ఇలా ఎంతోమంది హీరోలు , హీరోయిన్ లు కూడా అలాంటి పాత్రలు చేస్తూ, నిజజీవితంలో కూడా అలాంటివే చేయాలనుకుంటున్నారు. అలనాటి స్టార్ ల నుంచి ఇప్పుడున్న హీరోల వరకు అందరూ అలానే ఉKAMAL HASEN THAMILANDU EALCATION LOSS OF CM SET;pawan;chiranjeevi;balakrishna;kamal hassan;rajinikanth;jayalalitha;kalyan;pawan kalyan;bharatiya janata party;coimbatore;congress;telugu;nandamuri balakrishna;tamilnadu;heroine;service;nandamuri taraka rama rao;partyపవన్ కి ఆలా కమల్ కి ఇలా ?పవన్ కి ఆలా కమల్ కి ఇలా ?KAMAL HASEN THAMILANDU EALCATION LOSS OF CM SET;pawan;chiranjeevi;balakrishna;kamal hassan;rajinikanth;jayalalitha;kalyan;pawan kalyan;bharatiya janata party;coimbatore;congress;telugu;nandamuri balakrishna;tamilnadu;heroine;service;nandamuri taraka rama rao;partyMon, 03 May 2021 17:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సినిమాలలో ప్రజలకు సేవ చేయాలనే కథలతో మన ముందుకు వస్తూ ఉంటారు.. ఇది కేవలం రీల్ లైఫ్ తోనే ఆగకుండా రియల్  లైఫ్లో కూడా ప్రజలకు సహాయం చేయాలని ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోలను మనం ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి ,నాగబాబు , రజనీకాంత్ ,కమల్ హాసన్  ఇలా ఎంతోమంది హీరోలు , హీరోయిన్ లు కూడా అలాంటి పాత్రలు చేస్తూ, నిజజీవితంలో కూడా అలాంటివే చేయాలనుకుంటున్నారు. అలనాటి స్టార్ ల  నుంచి ఇప్పుడున్న హీరోల వరకు అందరూ అలానే ఉన్నారు. ఇక మన తెలుగులో అయితే ఎన్టీ రామారావు సినిమాలో నటించి తర్వాత రాజకీయంగా సొంత పార్టీ పెట్టి ఎంతో గొప్పగా ఎదిగిపోయాడు.


ఇక అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన నటనతో ఎంతో మందిని ఆదరించాడు. తరువాత అతనికి వున్న ప్రజల మీద అభిమానం తో  తను కూడా సొంత పార్టీ పెట్టాడు. కానీ  ఘోర పరాజయాన్ని చవిచూశాడు. అంతే కాకుండా తన పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేశాడు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి గెలుపొందాడు.

మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా పార్టీ పెట్టుకొని, ప్రజాసేవకై తపన పడుతున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల గెలవలేక పోతున్నాడు. ఇకపోతే జయలలిత సినిమాలలో,నటించి బాగా పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టడంతో ఆమె అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకుంది దాదాపుగా 3 సార్లు సీఎం పదవిని కైవసం చేసుకుంది.


ఇక ప్రస్తుతం ట్రెండింగ్ లో వున్న స్టార్ కమలహాసన్ విషయానికొస్తే, కమలాసన్ కూడా తన  నటనతో అందరిని మెప్పించాడు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ కూడా" మక్కల్ నీది మయ్యమ్ " అనే పార్టీని స్థాపించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజవర్గం సోత్ నుండి పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో ఉన్న కమల్, సాయంత్రానికి శ్రీనివాసన్ ముందంజలో ఉన్నారు. కమలహాసన్ మొదటి నుండి గట్టిగానే ప్రయత్నించి, చివరికి వచ్చేసరికి ఘోర అవమానం పాలయ్యాడు. కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి శ్రీనివాసన్, కమల్ హాసన్‌పై 1500 ఓట్లతో గెలుపొందారు.ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్న హీరోల లాగే కమలహాసన్ కూడా తన స్థానాన్ని రాజకీయాల్లో పదిలం చేసుకోలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా కమలహాసన్ ఘోర అవమానం పాలయ్యాడు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజల దగ్గరికే.. ప్రజా నాయకుడు..!!

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>