PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa3997659-7ab2-4428-9bc2-1b80dcb44d8f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa3997659-7ab2-4428-9bc2-1b80dcb44d8f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొదట్లో వందల్లో వచ్చే కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి చేరుతోంది. తాజాగా ఆదివారం వెలువడిన నివేదిక చూస్తే గుండె గుభేలంటోంది. గత 24 గంటల్లో 114299 శాంపిల్స్ కలెక్ట్ చేస్తే.. ఏకంగా 23, 920 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.. అంతే కాదు..మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఏకంగా 83 మంది మృతి చెందారు. ఏపీలో పాజిటివ్ రేటు 21 శాతంగా నమోదైంది. 1.35 మరణాల శాతం నమోదు అయ్యింది దీనికి తోడు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన వివరcoronavirus;kumaar;anil music;andhra pradesh;adinarayanareddy;heart;oxygen;house;anil kumar singhalఏపీలో కరోనా.. ఆ నెంబర్‌కు ఒక్క రోజులో 17,000 కాల్స్ ?ఏపీలో కరోనా.. ఆ నెంబర్‌కు ఒక్క రోజులో 17,000 కాల్స్ ?coronavirus;kumaar;anil music;andhra pradesh;adinarayanareddy;heart;oxygen;house;anil kumar singhalMon, 03 May 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొదట్లో వందల్లో వచ్చే కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి చేరుతోంది. తాజాగా ఆదివారం వెలువడిన నివేదిక చూస్తే గుండె గుభేలంటోంది. గత 24 గంటల్లో 114299 శాంపిల్స్ కలెక్ట్ చేస్తే.. ఏకంగా 23, 920 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.. అంతే కాదు..మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఏకంగా 83 మంది మృతి చెందారు. ఏపీలో పాజిటివ్ రేటు 21 శాతంగా నమోదైంది. 1.35 మరణాల శాతం నమోదు అయ్యింది

దీనికి తోడు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన వివరాలు భయం గొలుపుతున్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఐసియు బెడ్స్ అందుబాటులో ఉన్నాయని.. ఆక్సిజన్ బెడ్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్ల లభ్యత తగ్గుతుందని.. మొత్తంగా 81 కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27, 615 రేమిడిసివేర్ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. 104 కి కాల్స్ తాకిడి బాగా పెరిగిందట.. శనివారం  13 వేల కాల్స్ ఉంటే ఆది వారం 17వేలకు పైగా కాల్స్ వచ్చాయట. అలాగే  2589 మంది హాస్పిటల్ అడ్మిషన్ కోసం 104 కి కాల్ చేశారట. హోమ్ ఐసోలేషన్ పేషంట్స్ కి కూడా మేము కాల్ చేస్తున్నామని.. 92,702 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.

గత ఏడాది 18 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తీసుకున్నామని.. ఈ ఏడాది 16018 మందికి ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆక్సిజన్ డిమాండ్ అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని.. ఆక్సిజన్ పరికరాలు కొనుగోలుకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు. ఆక్సిజన్ పరికరాలు కొనుగోలు  కోసం ఏపీ ప్రభుత్వం  ప్రోక్యుర్మెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. సాధారణ విధానంలో వెళితే కొనుగోలుకు సమయం పడుతుందని కమిటీ ఏర్పాటు చేశారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>