MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48501c27-8bf3-4dd1-b7f5-3bb881efd246-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48501c27-8bf3-4dd1-b7f5-3bb881efd246-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ అనే పేరుతో ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున రిలీజ్ కావాల్సి ఉంది.. కరోనా కారణంగా దాదాపు అన్ని సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. కానీ మేకర్స్ ఇప్పటికయితే అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని బాలయ్య కోసం మరో రియల్ స్టోరీ tollywood;cbn;mahesh;ntr;balakrishna;gopichand;anil music;boyapati srinu;mahesh babu;trivikram srinivas;cinema;nandamuri balakrishna;nandamuri taraka rama rao;haarika & hassine creations;krackఅబ్బాయి వద్దనుకున్న బ్యానర్ లో బాబాయిఅబ్బాయి వద్దనుకున్న బ్యానర్ లో బాబాయిtollywood;cbn;mahesh;ntr;balakrishna;gopichand;anil music;boyapati srinu;mahesh babu;trivikram srinivas;cinema;nandamuri balakrishna;nandamuri taraka rama rao;haarika & hassine creations;krackMon, 03 May 2021 17:00:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ అనే పేరుతో ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున రిలీజ్ కావాల్సి ఉంది.. కరోనా కారణంగా దాదాపు అన్ని సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. కానీ మేకర్స్ ఇప్పటికయితే అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని బాలయ్య కోసం మరో రియల్ స్టోరీ సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

 మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. 

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కూడా ఈ బ్యానర్ లో రావాల్సి ఉండగా అనుకోని కారణాల వలన క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదే ఎన్టీఆర్ ప్లేస్ లో మహేష్ బాబుని పెట్టి సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ బ్యానర్ అధినేత చినబాబు బాలకృష్ణతో ఎలాగైనా ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. దాని కోసం ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు కూడా స్క్రిప్ట్ సిద్దం చేయమని చెప్పారని అంటున్నారు. వారిలో బాలయ్యకు తగ్గ కధ ఎవరు తయారు చేస్తే వాళ్ళతో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకసారి ఫైనల్ అయితే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పప్పుని హీరోని చేసిన జగన్...?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>