QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchi-maatabac68685-1a2e-4369-8290-b68c42724f25-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchi-maatabac68685-1a2e-4369-8290-b68c42724f25-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎంత సహాయం పొందినప్పటికీ కృతజ్ఞత లేని వ్యక్తులను ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాయి . అంటే ముందుగా మనం కూడా ఒకరిని సహాయం అడిగేముందు పూర్వం మనం ఎవరికైనా సహాయం చేశామా ? లేదా? ఒకవేళ సహాయం చేయగలిగే శక్తి ఉండి, చేయలేక పోయామే అని ఒకసారి ఆలోచించుకోండి. నిజానికీ అందరి మనస్తత్వం ఒకేలాగా ఉంటుంది అని అనుకోవడం తప్పు. అంతేకాకుండా సహాయం చేయగలిగినప్పుడు గొప్పగా అనుకోవటం, సహాయం పొందలేనప్పుడు సమాజాన్ని తిట్టుకోవటం మంచిది కాదు మిత్రమా.. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే, పంచుకున్న కష్టాలలో కూడా పది రకాలుగా తMANCHI MAATA;kanna lakshminarayana;shaktiమంచిమాట: సహాయం విలువ తెలియాలి అంటే ముందు ఆపద విలువ ఏంటో తెలియాలి..మంచిమాట: సహాయం విలువ తెలియాలి అంటే ముందు ఆపద విలువ ఏంటో తెలియాలి..MANCHI MAATA;kanna lakshminarayana;shaktiMon, 03 May 2021 06:00:00 GMT
ఇటీవల కాలంలో ఎంత సహాయం పొందినప్పటికీ కృతజ్ఞత లేని వ్యక్తులను ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాయి . అంటే ముందుగా మనం కూడా ఒకరిని సహాయం అడిగేముందు పూర్వం మనం ఎవరికైనా సహాయం చేశామా ? లేదా? ఒకవేళ సహాయం చేయగలిగే శక్తి ఉండి, చేయలేక పోయామే అని ఒకసారి ఆలోచించుకోండి. నిజానికీ అందరి మనస్తత్వం ఒకేలాగా ఉంటుంది అని అనుకోవడం తప్పు. అంతేకాకుండా సహాయం చేయగలిగినప్పుడు గొప్పగా అనుకోవటం, సహాయం పొందలేనప్పుడు సమాజాన్ని  
తిట్టుకోవటం మంచిది కాదు మిత్రమా..

ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే, పంచుకున్న కష్టాలలో కూడా పది రకాలుగా తప్పులు తిసే రకం లాంటిది. సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం ?అనే దాని కన్నా ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారు ?  అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.. అందుకే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరితోనూ  జాగ్రత్త గా వుండాలి.


ఒకప్పుడు ఒక్కరు బాగుపడితే వారిని చూసి పది మంది బాగు పడాలి అనుకునే వారు. అదే ఇప్పుడు ఒక్కరు బాగుపడితే అదే పదిమందిని ఎలా తోక్కేయాలి అని చూస్తున్నారు .ఇదే అప్పటి సమాజానికి , ఇప్పటి సమాజానికి తేడా !  మనము కూడా అందరూ బాగుండాలి అని ఎందుకు కోరుకోకూడదు? ఎదుటి వ్యక్తి బాగు పడినప్పుడు మనం కూడా బాగు పడతాము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు.. మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం. కాబట్టి ఎదుటి వాడు నాశనం అవ్వాలి అని కోరుకునే బదులు అదే ఎదుటి వ్యక్తి ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అని ఆలోచించాలి. అప్పుడే ఏ ఒక్కరు ఆపదలో చిక్కుకోరు. ఇక ప్రతి ఒక్కరికి సహాయం విలువ, అలాగే ఆపద విలువ కూడా కచ్చితంగా తెలుస్తుంది.

మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు , అపహాస్యం మాత్రం చేయకూడదు , ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణంఉండాలి. దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తన పెళ్లి విషయంలో ఫీల్ అవుతోన్న యాంగ్ హీరో..!

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>