MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_trailers/pofdfdssss-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_trailers/pofdfdssss-415x250-IndiaHerald.jpgనందమూరి కళ్యాణ్ రామ్ చాన్నాళ్లుగా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. చివరిగా అనిల్ రావిపూడితో పటాస్ సినిమా హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు.. దీంతో ఆయన కథల ఎంపికలో శ్రద్ధ వహిస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం కొత్తగా మొదలైంది.. జరుగుతున్న ప్రచారం మీరు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలో కనిపిస్తాడట. ఆయన సోదtollywood;ntr;pooja hegde;anil music;kalyan;kalyan ram;koratala siva;ram pothineni;cinema;mythri movie makers;nandamuri taraka rama rao;pataas;pataas 1;march;lavakusa;jai lavakusa;pattasకళ్యాణ్ రామ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్కళ్యాణ్ రామ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్tollywood;ntr;pooja hegde;anil music;kalyan;kalyan ram;koratala siva;ram pothineni;cinema;mythri movie makers;nandamuri taraka rama rao;pataas;pataas 1;march;lavakusa;jai lavakusa;pattasMon, 03 May 2021 07:08:00 GMTనందమూరి కళ్యాణ్ రామ్ చాన్నాళ్లుగా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. చివరిగా అనిల్ రావిపూడితో పటాస్ సినిమా హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు.. దీంతో ఆయన కథల ఎంపికలో శ్రద్ధ వహిస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం కొత్తగా మొదలైంది.. జరుగుతున్న ప్రచారం మీరు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలో కనిపిస్తాడట. ఆయన సోదరుడు ఎన్టీఆర్ కూడా జై లవకుశ సినిమా కోసం మూడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


 అదే కోవలో ఈ నటుడు కూడా మూడు పాత్రల్లో నటిస్తున్నాడు అని అంటున్నారు.. మరో ఆసక్తికర ప్రచారం ఏమిటంటే ఈ సినిమా కోసం అమిగోస్ అనే ఒక టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. అమిగోస్ అనేది స్పానిష్ టర్మ్. సాధారణంగా స్నేహితుడు అనే అర్థం వచ్చే చోట ఈ పదాన్ని వాడతారు. స్నేహానికి సంబంధించిన సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాకు అదే టైటిల్ బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ సినిమాని గత ఏడాది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఒక్కసారి కరోనా పరిస్థితులన్నీ కుదుటపడ్డాక ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క నిర్మాతగా తన సోదరుడు ఎన్టీఆర్ కొరటాల శివతో చేయబోతున్న సినిమా కోసం కూడా కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>