PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/naidu serious-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/naidu serious-415x250-IndiaHerald.jpgఏపీలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా ఫార్టీ ఇయర్స్ హిస్టరీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి రెండేళ్లుగా రాజకీయ ఇబ్బందులు తప్పడంలేదు. ఆ పార్టీకి వరసబెట్టి ఓటములే ఎదురు అవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో పరాజయాలు చాలు అనుకుంటే ఇపుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కూడా అలాగే షాక్ ఇచ్చేసింది. tdp;view;tiru;bharatiya janata party;janasena;2019;telugu;tirupati;husband;arrest;tdp;local language;ycp;janasena party;partyతిరుపతి ఫలితం తరువాత టీడీపీ లో ఏం జరగబోతోంది... ?తిరుపతి ఫలితం తరువాత టీడీపీ లో ఏం జరగబోతోంది... ?tdp;view;tiru;bharatiya janata party;janasena;2019;telugu;tirupati;husband;arrest;tdp;local language;ycp;janasena party;partySun, 02 May 2021 16:22:27 GMTఏపీలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా ఫార్టీ ఇయర్స్ హిస్టరీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి రెండేళ్లుగా రాజకీయ ఇబ్బందులు తప్పడంలేదు. ఆ పార్టీకి వరసబెట్టి ఓటములే ఎదురు అవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో పరాజయాలు చాలు అనుకుంటే ఇపుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కూడా అలాగే షాక్ ఇచ్చేసింది.

ఇక్కడ వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని తగ్గించాలని టీడీపీ శతవిధాలుగా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మరో వైపు చూసుకుంటే టీడీపీ ఓట్లే గతం కంటే బాగా తగ్గాయి. ఇక ఇదే తీరున టీడీపీ రాజకీయం సాగితే నాయకుల సంగతేంటి అన్నదే చర్చగా ఉంది. ఇప్పటికే చాలా మంది తమ్ముళ్ళు సైలెంట్ అయిపోయారు. అధికార వైసీపీ ఒక వ్యూహం ప్రకారం టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తోంది.

మరో మూడేళ్ల పాటు అధికారం చేతిలో ఉంది. దాంతో టీడీపీ ఇంకా చాలానే చూడాల్సి ఉంటుంది అంటున్నారు. ఇదే టైమ్ లో టీడీపీ ఎత్తిగిల్లకపోతే  మా పరిస్థితి ఏంటి అన్న ఆందోళన కూడా తమ్ముళ్లలో ఉంది అన్నది నిజం. అయితే తిరుపతిలో ఓడినా కూడా అది ముందే తెలిసిన ఫలితం. ఇక టీడీపీ 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓడింది. పైగా అది సిట్టింగ్ సీటు, వైసీపీది, దాంతో ఆ ప్రభావం పార్టీ మీద పడదు అనే అంటున్నారు.

ఇంత చెడ్డా కూడా ఏపీలో ప్రతీ ఎన్నికలోనూ  టీడీపీకి ముప్పై శాతానికి  పైగా ఓట్లు వస్తున్నాయి. ఇపుడే కాదు, 2024లో కూడా వైసీపీకి కచ్చితమైన పోటీ ఇచ్చే పార్టీ టీడీపీయే అవుతుంది అన్న లెక్కలు ఉన్నాయి. దాంతో ఆనాటికి చంద్రబాబు వ్యూహాలు రూపొందిస్తే కచ్చితంగా బీజేపీ, జనసేన వంటి వాటితో పొత్తు కుదురుతుంది అన్న ఆశలూ ఉన్నాయి. ఒక కూటమిగా టీడీపీ ముందుకు వస్తే వైసీపీని ఎదుర్కోవచ్చు అన్న మాట కూడా ఉంది. పైగా సార్వత్రిక ఎన్నికల్లో జనం తీర్పు వేరుగా ఉంటుంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా తిరుపతి ఫలితం తో కొంత నిరాశ అయితే టీడీపీలో ఉన్నా ఆ పార్టీని ఇప్పటికిపుడు వదిలి వెళ్ళిపోయే వారు ఉండరు అన్న మాట అయితే ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం

బీజేపీకి తిరుప‌తి, సాగ‌ర్లో ఘోర అవ‌మానం

బ్రేకింగ్‌: తిరుప‌తిలో వైసీపీ గెలుపు... మెజార్టీ ఎన్ని ల‌క్ష‌లు అంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>