Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chesina-pane-kcr-ni-cheyamantunna-sharmila92b7509e-edb0-4d07-84ee-340082fc4e6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chesina-pane-kcr-ni-cheyamantunna-sharmila92b7509e-edb0-4d07-84ee-340082fc4e6f-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రస్తుత కాలంలో పేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ముందుకి వెళ్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్న చందంగా మారింది పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి. ఓవైపు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి తరుణంలో అటు బయటకి వెళ్లి కుటుంబపోషణ కోసం పనులు చేసుకోలేక.. మరోవైపు ఇంట్లో ఉంటే ఇక నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి కుటుంబ పోషణ కోసం ధైర్యం తో బయటికి వెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి పంజా విసుYs sharmila;kcr;amala akkineni;jagan;andhra pradesh;telangana;chief minister;arogyasri;coronavirus;panjaaజగన్ చేసిన పనే.. కేసీఆర్ ను చేయమంటున్న షర్మిల..?జగన్ చేసిన పనే.. కేసీఆర్ ను చేయమంటున్న షర్మిల..?Ys sharmila;kcr;amala akkineni;jagan;andhra pradesh;telangana;chief minister;arogyasri;coronavirus;panjaaSun, 02 May 2021 09:30:00 GMTకరోనా వైరస్ ప్రస్తుత కాలంలో పేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది.  ముందుకి వెళ్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్న చందంగా మారింది పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి. ఓవైపు కరోనా వైరస్  వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి తరుణంలో అటు బయటకి వెళ్లి కుటుంబపోషణ కోసం పనులు చేసుకోలేక..  మరోవైపు ఇంట్లో ఉంటే ఇక నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి కుటుంబ పోషణ కోసం ధైర్యం తో బయటికి వెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి పంజా విసురుతోంది.



 ఇక ఆ తర్వాత మొదలవుతున్నాయి పేద మధ్య తరగతి ప్రజలకు అసలు కష్టాలు.  ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాం అంటే అక్కడ సరైన సదుపాయాలు లేక..  మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్దాం అంటే అక్కడ ఫీజులు కట్టుకునే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక మెరుగైన వైద్యం తో పాటు కరోనా చికిత్సను  ఆరోగ్య శ్రీ లో చేర్చితే బాగుండు అని తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలుచేస్తూ కరోనా చికిత్సను కూడా ఈ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు



 ఇలాంటి నేపథ్యంలో అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఇటీవలే వైయస్ షర్మిల కూడా ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చింది. ఇంకెప్పుడు సీఎం సారు కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్యశ్రీలో చేర్చేది.. 100 మందిలో 10 మందికి కరోనా వస్తే పది మందిలో తొమ్మిది మంది పేదవాళ్ళు ఉన్నారు కరోనా వైరస్ తో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది ఇప్పటికైనా కరోనా వైరస్ చికిత్స ఆరోగ్య శ్రీ లో చేర్చండి అంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇలా ఇక ఏపీలో తన అన్న చేసిన పనే కెసిఆర్ను చేయమంటుంది షర్మిల.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెంగాల్‌ లో టీఎంసీ - బీజేపీ మధ్య హోరాహోరీ..!

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

బ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దే

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్లో ఫ‌స్ట్ రౌండ్ అప్‌డేట్‌

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>