Politicsyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionresults20218469d142-4259-4276-ad64-91f8087abe56-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionresults20218469d142-4259-4276-ad64-91f8087abe56-415x250-IndiaHerald.jpgదేశం మొత్తాన్నీ ఎంతో ఉత్కంఠకు గురిచేశాయి తాజా ఎన్నికలు. నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీలోని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే బీజేపీకి ఘోర పరాభవం తప్పదని సుస్పష్టమవుతోంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన స్థాయిని తగ్గించుకుని మరీ.. రాష్ట్ర స్థాయి నాయకులతో పోటీ పడ్డారు. గెలుపు కోసం అన్నిరకాల ప్రయత్నాలూ..Electionresults2021;amit shah;tiru;kerala;assam;bharatiya janata party;puducherry;west bengal - kolkata;narendra modi;amith shah;prime minister;history;assembly;tamilnadu;local language;allu sneha;party;narendraఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?Electionresults2021;amit shah;tiru;kerala;assam;bharatiya janata party;puducherry;west bengal - kolkata;narendra modi;amith shah;prime minister;history;assembly;tamilnadu;local language;allu sneha;party;narendraSun, 02 May 2021 18:19:20 GMTఇంటర్నెట్ డెస్క్: దేశం మొత్తాన్నీ ఎంతో ఉత్కంఠకు గురిచేశాయి తాజా ఎన్నికలు. నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీలోని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే బీజేపీకి ఘోర పరాభవం తప్పదని సుస్పష్టమవుతోంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన స్థాయిని తగ్గించుకుని మరీ.. రాష్ట్ర స్థాయి నాయకులతో పోటీ పడ్డారు. గెలుపు కోసం అన్నిరకాల ప్రయత్నాలూ చేశారు. మోదీతో పాటు అమిత్ షా కూడా రాష్ట్రాలన్నీ తిరుగుతూ విపరీతంగా ప్రచారం చేశారు. ‘తాము కచ్చితంగా గెలిచేస్తాం, ఈ సారి ప్రభంజనం సృష్టిస్తాం, చరిత్ర తిరగరాస్తాం..’ అనే స్థాయిలో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు. కానీ వారి అంచనాలను ప్రజలు తలకిందులు చేశారు. వారి ప్రచారాలకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ఉండడమే కాకుండా ఓటమి రుచి చూపించారు. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో బొక్క బోర్లా పడ్డట్లైంది. ఇది బీజేపీకి నైతికంగా అతి పెద్ద ఓటమని విశ్లేషకులు వర్ణిస్తున్నారు.

2016లో ఇదే రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా.. అందులో కేరళ ఎన్నికల్లో బీజేపీ 1 స్థానంలో గెలిచింది.  అయితే ఈ సారి మాత్రం ఆ స్థానం కూడా దక్కేలాలేదు. ఇక అస్సాంలో అధికారం మళ్లీ బీజేపీకే దక్కేలా కనిపిస్తున్నా.. గత ఎన్నికలతో పోల్చితే మాత్రం కొంతమేర సీట్లు తగ్గినట్లే కనిపిస్తోంది. గతేడాది అస్సాం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 86 సీట్లు వస్తే ఈ సారి కేవలం 83 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. వీటిలో బీజేపీ ఓ స్థానంలో విజయం సాధించింది. అంటే గత ఎన్నికలకంటే ఈ సారి బీజేపీ నైతికంగా ఓడిందనే చెప్పాలి. అయితే ఈ ఓటమిని బీజేపీ ఓటమిగా పరిగణించాలా అంటే.. కానే చెబుతున్నారు విశ్లేషకులు. ఇది కచ్చితంగా ఆ పార్టీ ఓటమి కాదని, ఇది కేవలం మోదీ-షా ద్వయం ఓటమేనని అంటున్నారు.

ఒకప్పుడు బీజేపీలో వాజ్‌పేయి-లాల్ కిషన్ అడ్వానీ వంటి గొప్ప నేతలున్నప్పుడు కూడా వారు పార్టీకి అనుకూలంగా, పార్టీ నిర్ణయాలకు లోబడే పనిచేసేవారిని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అంటున్నారు. బీజేపీ అంటే కేవలం మోదీ-షాలు మాత్రమే అనేలా ప్రచారం సాగుతోందని, అలా వారిద్దరే పార్టీగా మారడంతోనే బీజేపీ ఈ ఓటమిని చవి చూడాల్సి వస్తోందని అంటున్నారు. ఇక బెంగాల్లో కూడా మోదీ-షా ఎంత పోరాడినా ఓటమి తప్పేలాలేదు. ప్రతి ప్రచారంలోనూ 200పైగా సీట్లు సాధిస్తామని ఎంతో ధీమాగా ప్రకటనలు చేసినా.. చివరికి కనీసం రెండంకెల మార్కును కూడా దాటలేకపోయారు. ఎంత పోరాడినా కనీసం 100 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. తమిళనాడులో ఎప్పటిలానే స్థానిక ప్రభావం డీఎంకే పార్టీకే పట్టం కట్టేలా కనిపిస్తోంది. అయితే బీజేపీతో స్నేహంగా ఉంటున్నప్పటకీ అన్నాడీఎంకేకు కూడా ప్రజాదరణ లభించడం కొసమెరుపు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>